శనివారం, 11 జనవరి 2025
  1. క్రీడలు
  2. ఇతర క్రీడలు
  3. వార్తలు
Written By selvi
Last Updated : ఆదివారం, 17 డిశెంబరు 2017 (17:35 IST)

టైటిల్ వేటలో ఇంటిముఖం పట్టిన పీవీ సింధు

హైదరాబాదీ స్టార్ షట్లర్ పీవీ సింధూకు చుక్కెదురైంది. బ్యాడ్మింటన్ సూపర్ సిరీస్ ఫైనల్స్ టైటిట్‌కు అడుగు దూరంలో నిలిచిపోయింది. టోర్నీ అంతా అజేయంగా నిలిచింది. కానీ ఆదివారం జరిగిన ఫైనల్ పోరులో జపాన్ ప్లేయర

హైదరాబాదీ స్టార్ షట్లర్ పీవీ సింధూకు చుక్కెదురైంది. బ్యాడ్మింటన్ సూపర్ సిరీస్ ఫైనల్స్ టైటిట్‌కు అడుగు దూరంలో నిలిచిపోయింది. టోర్నీ అంతా అజేయంగా నిలిచింది. కానీ ఆదివారం జరిగిన ఫైనల్ పోరులో జపాన్ ప్లేయర్ యమగుచి చేతిలో ఓడిపోయింది. 93 నిమిషాల పాటు సాగిన ఈ మ్యాచ్‌లో సింధు 21-15, 12-21, 19-21 తేడాతో పరాజయం పాలైంది. 
 
ఇప్పటికే గ్రూప్ స్టేజ్‌లో ఇదే ప్లేయర్‌పై గెలిచిన సింధు.. ఫైనల్లోనూ తొలి గేమ్‌లోనే 21-15తో విజయం సాధించింది. అయితే రెండో గేమ్‌లో అనూహ్యంగా పుంజుకున్న యమగుచి.. వరుసగా పాయింట్లు గెలుస్తూ వెళ్లింది. 21-12తో రెండో గేమ్ గెలిచిన యమగుచి మ్యాచ్‌ను 1-1తో సమం చేసింది. 
 
నిర్ణయాత్మక మూడో గేమ్ హోరాహోరీగా సాగింది. మొదట్లో సింధు లీడ్‌లోకి దూసుకెళ్లినా తర్వాత వెనుకబడింది. ప్రతి పాయింట్ కోసం ఇద్దరు ప్లేయర్స్ పోటాపోటీగా తలపడ్డారు. చివరికి 19-19 స్కోరు దగ్గర సమం కాగా.. ఆ సమయంలో రెండు వరుస పాయింట్లతో యమగుచి టైటిల్ ఎగరేసుకుపోయింది. దీంతో సింధూ నిరాశతో వెనుదిరిగింది.