గురువారం, 9 జనవరి 2025
  1. క్రీడలు
  2. ఇతర క్రీడలు
  3. వార్తలు
Written By selvi
Last Updated : శనివారం, 16 డిశెంబరు 2017 (10:38 IST)

బీడబ్ల్యూఎఫ్ సూపర్ సిరీస్: సత్తా చాటిన సింధు.. సెమీస్‌లో గెలిస్తే..

భారత ఒలింపిక్ విజేత పీవీ సింధు తన సత్తా చాటుకుంది. బీడబ్ల్యూఎఫ్ సూపర్ సిరీస్ ఫైనల్స్‌లో పీవీ సింధు మెరుగైన ఆటతీరును ప్రదర్శించింది. ఇప్పటికే సెమీఫైనల్లోకి దూసుకెళ్లిన పీవీ సింధు.. గ్రూప్ దశలో నామమాత్ర

భారత ఒలింపిక్ విజేత పీవీ సింధు తన సత్తా చాటుకుంది. బీడబ్ల్యూఎఫ్ సూపర్ సిరీస్ ఫైనల్స్‌లో పీవీ సింధు మెరుగైన ఆటతీరును ప్రదర్శించింది. ఇప్పటికే సెమీఫైనల్లోకి దూసుకెళ్లిన పీవీ సింధు.. గ్రూప్ దశలో నామమాత్రమైన చివరి పోరులో విజయ బావుటా ఎగురవేసింది. గ్రూప్ దశలో నామమాత్రమైన చివరి పోరులో సింధు గెలుపును నమోదు చేసుకుంది.
 
జపాన్ స్టార్ యమగుచితో శుక్రవారం జరిగిన పోరులో 21-9, 21-13తో వరుస సెట్లలో విజయం సాధించింది. తొలి సెట్‌ను సునాయాసంగా గెలుచుకున్న పీవీ సింధు రెండో సెట్లో కాస్త ప్రతిఘటన ఎదుర్కొంది. అయినా సింధు షాట్ల ముందు యమగుచి తలవంచక తప్పలేదు. 
 
ఈ విజయంతో గ్రూప్ దశను ముగించిన సింధు గ్రూప్-ఎలో అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది. తద్వారా శనివారం జరుగనున్న సెమీఫైనల్లో చైనా క్రీడాకారిణి చెన్ యుఫీతో తలపడేందుకు సిద్ధమైంది. ఈ సెమీఫైనల్లో సింధు గెలిస్తే.. సింధు ఖాతాలో మరో పతకం సొంతం చేసుకున్నట్లవుతుంది.