శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By selvi
Last Updated : సోమవారం, 18 డిశెంబరు 2017 (15:38 IST)

ద్రౌపది తొలి ఫెమినిస్ట్... మొండి పట్టుదల వల్లే మహాభారత యుద్ధం

వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంలో బీజేపీ ఎంపీలు ఎప్పుడూ ముందుంటారనే విషయం తెలిసిందే. తాజాగా బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈసారి పంచపాండవుల సతీమణ ద్రౌపదిపై ఆమె సంచలన

వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంలో బీజేపీ ఎంపీలు ఎప్పుడూ ముందుంటారనే విషయం తెలిసిందే. తాజాగా బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈసారి పంచపాండవుల సతీమణ ద్రౌపదిపై ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు. ద్రౌపదికి ఐదుగురు భర్తలున్నప్పటికీ ఆమె ఎప్పుడూ ఎవ్వరి మాట వినలేదన్నారు. 
 
మహాభారత యుద్ధానికి ద్రౌపది మొండి పట్టుదలే ఏకైక కారణమని రామ్ మాధవ్ కామెంట్స్ చేశారు. ఆమె మొండి పట్టుదల వల్ల ఏకంగా 18 లక్షల మంది ఆసువులు బాసారని రామ్ మాధవ్ అన్నారు. ఆమెను ప్రపంచంలోనే తొలి స్త్రీవాదిగా కొనియాడుతూనే.. ఆమెపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

ద్రౌపది మొండితనం వల్లే మహాభారత యుద్ధం జరిగిందన్నారు. పనాజీలో నిర్వహించిన ఇండిక్ ఫెస్టివల్‌లో రామ్ మాధవ్ మాట్లాడుతూ.. భర్తలు చెప్పిన మాటను వినని.. ద్రౌపది శ్రీకృష్ణుడి మాటలనే వేదవాక్కుగా పరిగణించిందని చెప్పుకొచ్చారు.