1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
  4. This Reason why Rajinikanth will not sweep Tamil Nadu

రజనీకాంత్‌కు సీఎం ఛాన్స్ లేదట... ఎందుకంటే?

తమిళనాడు రాష్ట్రంలో నెలకొనివున్న రాజకీయ పరిస్థితులను క్యాష్ చేసుకోవడానికి రాజకీయ అరంగేట్రం చేసిన సూపర్ స్టార్ రజనీకాంత్‌కు ముఖ్యమంత్రి యోగం లేదట. ఈ విషయాన్ని ప్రముఖ కర్ణాటక జ్యోతిష్యుడు ప్రకాష్ అమ్మున

Rajinikanth
తమిళనాడు రాష్ట్రంలో నెలకొనివున్న రాజకీయ పరిస్థితులను క్యాష్ చేసుకోవడానికి రాజకీయ అరంగేట్రం చేసిన సూపర్ స్టార్ రజనీకాంత్‌కు ముఖ్యమంత్రి యోగం లేదట. ఈ విషయాన్ని ప్రముఖ కర్ణాటక జ్యోతిష్యుడు ప్రకాష్ అమ్మునాయ్ ఘంటాపథంగా చెపుతున్నారు. 
 
దీనికి కారణం... రజనీకాంత్‌కు సర్పదోషం ఉండటమేనట. మకరరాశికి చెందిన రజనీ సింహలగ్నంలో జన్మించడం వల్ల ప్రత్యర్థులెవ్వరూ పోటీ పడి ఆయనను ఓడించలేరు. అయితే, రజనీ.. తన సన్నిహితుల పట్ల అప్రమత్తంగా ఉండాలి. వారివల్ల చెడు జరిగే అవకాశముంది. ఈ పరిస్థితుల్లో రజనీ తనను సీఎం అభ్యర్థిగా ప్రకటించుకోకుండా, పార్టీ నాయకుడిగా ఉండి "కింగ్‌మేకర్''గా వ్యవహరించాలని సలహా ఇచ్చారు. 
 
కాగా, డిసెంబర్ 31వ తేదీన రాజకీయాల్లోకి రావనున్నట్టు రజనీకాంత్ ప్రకటించిన విషయం తెల్సిందే. ఆ తర్వాత "రజనీ రసిగర్ మండ్రం" పేరుతో ఓ వెబ్‌సైట్, యాప్‌ను ప్రారంభించి, సభ్యత్వ నమోదుకు శ్రీకారం చుట్టారు. అనంతరం జాతీయ మీడియాకు ధన్యవాదులు తెలిపేందుకు ప్రత్యేకంగా వారితో సమావేశమయ్యారు. తదుపరి డీఎంకే చీఫ్ కరుణానిధిని కలిసి ఆశీస్సులు అందుకున్నారు. ఇలా రజనీకాంత్ ఆచితూచి అడుగులు వేస్తున్నారు. 
About Writer
pnr
తర్వాతి కథనం
ఆట కోసం గర్ల్స్‌ను అలా కూర్చోబెట్టారు.. చూసేందుకు జనాల క్యూ (వీడియో)