బుధవారం, 6 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : గురువారం, 4 జనవరి 2018 (11:04 IST)

తలైవర్‌తో తలైవా : కరుణ ఆశీస్సులందుకున్నా : రజనీకాంత్

తమిళ తలైవర్‌తో తలైవా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కొత్త సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన తలైవా... తలైవర్ ఆశీస్సులు అందుకున్నారు. ఆ తలైవర్ ఎవరో కాదు తమిళ రాజకీయ కురువృద్ధుడు, డీఎంకే అధినేత ఎం.కరుణానిధి కాగా

తమిళ తలైవర్‌తో తలైవా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కొత్త సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన తలైవా... తలైవర్ ఆశీస్సులు అందుకున్నారు. ఆ తలైవర్ ఎవరో కాదు తమిళ రాజకీయ కురువృద్ధుడు, డీఎంకే అధినేత ఎం.కరుణానిధి కాగా తలైవా సూపర్ స్టార్ రజినీకాంత్. 
 
చెన్నై, గోపాలపురంలోని కరుణానిధి నివాసానికి బుధవారం రాత్రి రజనీకాంత్ వెళ్లారు. రజనీకి డీఎంకే కార్యాచరణ అధ్యక్షుడు స్టాలిన్‌ సాదరంగా స్వాగతించారు. కరుణతో పావుగంట సేపు భేటీ అయిన రజనీ.. ఆయన ఆశీస్సులు పొందారు. కరుణానిధికి ఆంగ్ల సంవత్సరాది శుభాకాంక్షలు తెలిపానని, ఆయన ఆరోగ్యపరిస్థితిని అడిగి తెలుసుకున్నట్టు ఈ సమావేశం అనంతరం రజనీకాంత్ వెల్లడించారు. 
 
అయితే, త్వరలో రాజకీయ పార్టీ పెట్టాలని భావిస్తున్న రజనీకాంత్, స్వయంగా డీఎంకే అధినేత కరుణానిధి వద్దకు వచ్చి ఆశీర్వాదం తీసుకోవడంపై ఆయన కుమారుడు స్టాలిన్ మండిపడ్డారు. తమిళనాడులో ద్రవిడ సిద్ధాంతాలను కనుమరుగు చేయాలని కొందరు ప్రయత్నిస్తున్నారని, వారి ఆటలు సాగవని హెచ్చరించారు.
 
తమిళ ప్రజల్లో ద్రవిడ వేదాంతం వేళ్లూనుకుపోయిందని, దాన్ని తొలగించే శక్తి భవిష్యత్ తరాలకు కూడా లేదన్నారు. ద్రవిడ సిద్ధాంతంపై రజనీకాంత్‌కు నమ్మకం లేదన్నట్టుగా వ్యాఖ్యానించిన స్టాలిన్, ఎవరికి ఓటు వేయాలో, ఎవరికి ఓటు వేయకూడదో తమిళ ప్రజలకు తెలుసునని వ్యాఖ్యానించారు.