శనివారం, 4 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : బుధవారం, 3 జనవరి 2018 (09:22 IST)

మీడియాను ఎలా హ్యాండిల్ చేయాలో తెలియడం లేదు: రజనీకాంత్

త్వరలో రాజకీయ అరంగేట్రం చేయనున్న తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్‌ తాజా ఓ సమస్యలో చిక్కుకున్నారట. గతంలో మీడియాలో పని చేసిన ఈయన.. ఇపుడు అదే మీడియాను ఎలా ఎదుర్కోవాలో తెలియడం వాపోతున్నారు. దీంతో ఆయన మీట్ అండ్

త్వరలో రాజకీయ అరంగేట్రం చేయనున్న తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్‌ తాజా ఓ సమస్యలో చిక్కుకున్నారట. గతంలో మీడియాలో పని చేసిన ఈయన.. ఇపుడు అదే మీడియాను ఎలా ఎదుర్కోవాలో తెలియడం వాపోతున్నారు. దీంతో ఆయన మీట్ అండ్ గ్రీట్ పేరుతో ఓ సమావేశం నిర్వహించారు. 
 
చెన్నైలోని ఓ నక్షత్ర హోటల్‌లో మంగళవారం జరిగిన ఈ కార్యక్రమంలో జాతీయ మీడియాతో పాటు ప్రాంతీయ మీడియా ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారితో తలైవర్ పిచ్చాపాటిగా మాట్లాడుతూ, "నేను రెండు నెలలపాటు కర్ణాటక మీడియాలో పనిచేశానని, కానీ ఇప్పుడు నాకు మీడియాను ఎలా హ్యాండిల్ చేయాలో తెలియడం లేదు" అని వ్యాఖ్యానించారు. 
 
అదేసమయంలో రాజకీయాలకు తాను కొత్త అని, తనకు తెలియకుండా ఏదైనా తప్పు జరిగి ఉంటే క్షమించమని కోరారు. మీడియా వల్లే నేను ఇంతవాడినయ్యానని చెప్పుకొచ్చారు. ఆ తర్వాత మీడియా ప్రతినిధులు, ఫోటో జర్నలిస్టులతో రజినీకాంత్ కరచాలనం చేస్తూ ఫోటోలు దిగారు. ఇక రజనీ రాజకీయ ప్రవేశాన్ని కొంత మంది స్వాగతిస్తుంటే మరికొందరు మాత్రం బాహాటంగానే వ్యతిరేకిస్తున్నారు.