సోమవారం, 6 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By selvi
Last Updated : ఆదివారం, 31 డిశెంబరు 2017 (13:45 IST)

రజనీకాంత్ రాజకీయ ప్రకటన- ఫుల్ స్పీచ్ వీడియో- అమితాబ్ హర్షం

తమినాడులో తలైవా రాజకీయాల్లోకి వస్తున్నారు. రాజకీయాల్లో వస్తున్నా... యుద్ధానికి అందరూ సిద్ధం కావాలని.. ప్రజలు తనకు వందశాతం మద్దతిస్తారని సూపర్ స్టార్ రజనీకాంత్ ప్రకటించారు. 2019 ఎన్నికల కోసం అందరూ సిద్

తమినాడులో తలైవా రాజకీయాల్లోకి వస్తున్నారు. రాజకీయాల్లో వస్తున్నా... యుద్ధానికి అందరూ సిద్ధం కావాలని.. ప్రజలు తనకు వందశాతం మద్దతిస్తారని సూపర్ స్టార్ రజనీకాంత్ ప్రకటించారు. 2019 ఎన్నికల కోసం అందరూ సిద్ధం కావాలని.. ఇప్పటి వరకు గుర్తింపు పొందిన అభిమాన సంఘాలు వేల సంఖ్యలో వుంటే గుర్తింపు పొందని అభిమాన సంఘాలు అంతకుమించి రెండింతలు అధికంగా వున్నాయి. 
 
ఆ సంఘాలన్నీ ఏకంగా కావాలి. ప్రజలందరినీ ఆ సంఘాలు ఏకం చేయాలి. జిల్లాకు కాదు.. గ్రామానికి కాదు.. వీధికో సంఘం ఏర్పడాలి. ఆ సంఘం ప్రజలను ఒకే గొడుగులోకి  తీసుకురావాలి. కార్యకర్తగా కాదు.. సైనికుడిగా పనిచేయాలి. అవినీతి లేని సైనికులు సామాజిక సేవలో పాల్గొనాలి. సైనికులుగా క్రమశిక్షణతో అవినీతికి పాల్పడని వ్యక్తులు తన సైన్యంలో వుంటారు.