1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By selvi
Last Updated : ఆదివారం, 31 డిశెంబరు 2017 (12:44 IST)

ఎంజీఆర్, జయలలిత తర్వాత రజనీకాంతే: ఎమ్మెల్యే రోజా ప్రకటన

తమిళనాడులో ప్రస్తుతం నెలకొన్న రాజకీయాల నేపథ్యంలో రాజకీయాల్లోకి వస్తానని ప్రకటించిన సూపర్ స్టార్ రజనీకాంత్ రాజకీయాల్లో సక్సెస్ అవుతారని వైకాపా ఎమ్మెల్యే, సినీనటి రోజా ధీమా వ్యక్తం చేశారు. అయితే రాజకీయా

తమిళనాడులో ప్రస్తుతం నెలకొన్న రాజకీయాల నేపథ్యంలో రాజకీయాల్లోకి వస్తానని ప్రకటించిన సూపర్ స్టార్ రజనీకాంత్ రాజకీయాల్లో సక్సెస్ అవుతారని వైకాపా ఎమ్మెల్యే, సినీనటి రోజా ధీమా వ్యక్తం చేశారు. అయితే రాజకీయాల్లో ఎదురయ్యే, కుట్రలు, కుతంత్రాలను తలైవా సమర్థవంతంగా ఎదుర్కోవాలని రోజా వ్యాఖ్యానించారు. రాజకీయాల్లో సక్సెస్ అయిన సినీ తారలు వున్నారు. 
 
పార్టీలెత్తేసిన స్టార్లు వున్నారని చెప్పారు. రాజకీయాల్లోకి ఎప్పటి నుంచో దూరంగా వుంటున్న రజనీకాంత్.. ప్రస్తుతం ప్రజలకు మేలు చేయాలని బరిలో దిగడం మంచి పరిణామమని చెప్పుకొచ్చారు. సినిమాల్లో ఆయనెలా పేద ప్రజలకు అండగా వుంటారో.. అదే తరహాలో రాజకీయాల్లోకి ప్రజలకు మేలు చేసే సిద్ధాంతాలను పాటిస్తే ఎంజీఆర్, జయలలితకు తర్వాత రాజకీయాల్లో రాణించే నాయకుడిగా రజనీకాంత్ అవుతారని రోజా వ్యాఖ్యానించారు. 
 
అయితే తమిళ రాజకీయాల్లోకి రజనీకాంత్ రానున్నట్లు చేసిన ప్రకటనపై బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్యస్వామి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తాను రాజకీయాల్లోకి వస్తున్నట్టు మాత్రమే రజనీ ప్రకటన చేశారని,  దీనికి సంబంధించిన వివరాలను, డాక్యుమెంట్లను మాత్రం ఆయన వెల్లడించలేదని స్వామి సైటెర్ వేశారు. రజనీకాంత్ ఒక నిరక్షరాస్యుడని... మీడియా మాత్రం రజనీకాంత్‌ను గొప్పగా చూపుతోందని తెలిపారు.