1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
  4. MLA Roja Comments on Rajinikanth Political Entry

రజినీ రాజకీయ రంగప్రవేశంపై రోజా అలా చెప్పేశారు....

తమిళ తలైవా రజినీకాంత్ రాజకీయాల్లోకి వస్తున్నట్లు ప్రకటన చేసిన తరువాత ఒక్కొక్కర ఒక్కో ప్రకటన చేస్తున్నారు. కొంతమంది విమర్శలు చేస్తుంటే మరికొందరు మాత్రం రజినీకి తిరుగులేదంటూ పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. అందులో సినీ నటి, వైసిపి ఎమ్మెల్యే రోజా కూడా ఒకరు.

MLA Roja
తమిళ తలైవా రజినీకాంత్ రాజకీయాల్లోకి వస్తున్నట్లు ప్రకటన చేసిన తరువాత ఒక్కొక్కర ఒక్కో ప్రకటన చేస్తున్నారు. కొంతమంది విమర్శలు చేస్తుంటే మరికొందరు మాత్రం రజినీకి తిరుగులేదంటూ పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. అందులో సినీ నటి, వైసిపి ఎమ్మెల్యే రోజా కూడా ఒకరు. రజినీకాంత్ రాజకీయ ప్రవేశంపై రోజా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారుతున్నాయి. 
 
ఎంజిఆర్, జయలలిత తరువాత రాజకీయంగా రజినీకాంత్ చరిత్రలో నిలిచిపోవడం ఖాయమంటున్నారు రోజా. రజినీకి అనుభవం కాదు ముఖ్యం... చెయ్యాలన్న మనస్సుంది. ఆ మహా సంకల్పమే ఆయన్ను ఎక్కడికో తీసుకెళుతుందన్న నమ్మకం నాకుంది అన్నారు రోజా. సరైన సమయంలోనే రజినీ రాజకీయాల్లోకి వస్తున్నారని, కుట్రలు, కుతంత్రాలు రజినీకి తెలియవని, వాటికి ఆయన దూరంగా ఉంటేనే మంచిదన్నారు. 
 
రాజకీయాల్లో నూటికి నూరుశాతం రజినీకాంత్ సక్సెస్ అవుతారన్న నమ్మకం తనకుందన్నారు రోజా. రజినీని పొగడ్తలతో రోజా ముంచెత్తడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారుతోంది.
తర్వాతి కథనం
పాక్ విషయంలో అమెరికా పిచ్చిపని చేసిందన్న ట్రంప్... గిలగిలలాడుతున్న పాక్... ఎందుకు?