1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
  4. Drone like Object Spotted in Jammu again

సరిహద్దుల్లో డ్రోన్ల్ కలకలం... భారత బలగాల్లో కలవరం

Jammu and Kashmir
జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలోని ఇండోపాక్ సరిహద్దుల్లో మళ్లీ డ్రోన్ల కలకలం చెలరేగింది. శనివారం రాత్రి ఈ జిల్లాలోని డోమానా లోను, సాంబా జిల్లాలోనూ డ్రోన్లవంటివి కనిపించినట్టు స్థానికులు తెలిపారు. కొన్ని గంటల వ్యవధిలో మూడు సార్లు వీటిని తాము చూసినట్టు తెలిపారు. 
 
తొలుత సాంబా జిల్లాలో గత రాత్రి 8-9 గంటల మధ్య రెండు డ్రోన్ల వంటివి కనిపించాయని.. తక్కువ వెలుతురులో ఎగురుతున్న తాను వీటిని తన సెల్‌లో వీడియోగా చిత్రీకరించానని స్థానికుడొకరు తెలిపారు. ఆ తర్వాత డోమానా జిల్లాలో రాత్రి 9 గంటల 50 నిముషాల ప్రాంతంలో తాను కూడా ఈ విధమైన వస్తువును చూసి తన మొబైల్ లో చిత్రీకరించానని, మూడు నిముషాలకే ఆ వస్తువు కంపించకుండా పోయిందని ఈ జిల్లా వాసి ఒకరు చెప్పారు. 
 
వీరు ఈ విషయాన్నీ భద్రతా దళాల దృష్టికి తీసుకు వెళ్లగా సెక్యూరిటీ అధికారులు వెంటనే గాలింపు ప్రారంభించారు. అయితే ఇవి డ్రోన్లు అయి ఉండవచ్చునని చెప్పలేమని అధికారులు పేర్కొన్నారు. 
About Writer
ఠాగూర్
తర్వాతి కథనం
కష్టమర్లకు షాకిచ్చిన ఐసీఐసీ బ్యాంక్... నేటి నుంచే అమలు