సంబంధిత వార్తలు
- కలియుగ ధర్మరాజు... పేకాటలో భార్యను పందెం కాసిన భర్త...
- ఏడేళ్ళ నాటి కేసును తిరగదోడారు... చిక్కుల్లో మోహన్‌లాల్ .. దోషిగా తేలితే జైలే
- నిజామాబాద్‌లో దారుణం : సినిమాకంటూ తీసుకెళ్లి యువతిపై గ్యాంగ్ రేప్
- రాజస్థాన్‌లో ఘోరం.. 50 రోజులుగా మహిళపై సామూహిక అత్యాచారం.. గర్భం..
- 'నన్ను రేప్ చేశారు... ఇప్పుడు నా కూతుళ్లనూ అలా చేస్తారేమోనని భయపడుతున్నా'
లవ్ జిహాద్ వేధింపులు : మత్తుమందిచ్చి అత్యాచారం ... ఇస్లాంలోకి మారాలంటూ...
కేరళ రాష్ట్రంలోని కోళికోడ్‌లో ఓ యువకుడు లవ్ జిహాద్ పేరుతో ఓ యువతిని వేధించాడు. ఆ యువతికి మత్తుమందు కలిపిన శీతలపానీయం ఇచ్చి.. ఒక యేడాది పాటు అత్యాచారం చేశాడు. ఈ క్రమంలో ఆ యువతి నగ్నఫోటోలను తీసిన యువకుడు.. ఆమె బ్లాక్‌మెయిల్ చేయసాగాడు. పైగా, ఇస్లాంలోకి మారాలంటూ వేధించసాగాడు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే,
కోజికోడ్‌లో పట్టణానికి చెందిన ఫజల్ (21), 19 యేళ్ల బాధిత యువతి ఓ ట్యూషన్ సెంటర్‌లో క్లాస్‌మేట్స్. ఈ యేడాది జూలైలో ఆమెకు మత్తుమందు ఇచ్చి పలుమార్లు అత్యాచారం చేశాడు. ఆమె నగ్న ఫొటోలు, వీడియోలు తీశాడు. ఆపై వాటిని చూపించి ఇస్లాంలోకి మారాలంటూ ఒత్తిడి చేశాడు. లేకుంటే వాటిని సోషల్ అప్లలోడ్ చేస్తానంటూ బెదిరించాడు.
ఈ వేధింపులను భరించలేని ఆ యువతి తన స్నేహితుల దృష్టికి తీసుకెళ్లింది. ఆ తర్వాత తన తల్లిదండ్రులకు చెప్పడంతో వారంతా కలిసి ఈ నెల 8వ తేదీన పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే, ఈ వ్యవహారంలో లవ్ జిహాద్ ఛాయలు కనిపిస్తుండడంతో పోలీసులు ఈ కేసును ఎన్ఐఏకు అప్పగించారు. దీంతో ఎన్ఐఏ అధికారులు బాధితురాలి నుంచి వాంగ్మూలం తీసుకుని, పరారీలో ఉన్న ఫజల్ కోసం పోలీసులు గాలిస్తున్నారు.
