రాజస్థాన్‌లో ఘోరం.. 50 రోజులుగా మహిళపై సామూహిక అత్యాచారం.. గర్భం..
రాజస్థాన్‌లో ఘోరం జరిగింది. ఓ మహిళపై కామాంధులు విరుచుకుపడ్డారు. ఓ మహిళకు మత్తు మందు ఇచ్చి.. 50 రోజులుగా ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన దారుణ ఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది. వివరాల్లోకి వెళితే.. బెహరార్‌కు చెందిన యువతికి ఇటీవల వివాహమైంది. జూలై 20న ఆమె ఒంటరిగా బయటకు వెళ్లింది.
ఇదే అదునుగా భావించిన ఆరుగురు యువకులు ఆమెను కిడ్నాప్ చేసి కారులో ఎక్కించుకుని తీసుకెళ్లారు. ఓ చోట ఆమెను నిర్బంధించి తమ కోరిక తీర్చాలని బలవంతం చేశారు. అందుకు ఆమె నిరాకరించడంతో ఆహారంలో డ్రగ్స్ కలిపి తినిపించారు. అది తిని ఆమె మత్తులోకి జారుకున్న తర్వాత యువకులు తమ పశువాంఛను తీర్చుకున్నారు.
50 రోజులుగా వారు నిత్యం ఇదే పనిచేస్తుండటంతో ఆమె గర్భం దాల్చింది. ఇటీవల కిడ్నాపర్లు ఆమెను తాళ్లతో బంధించడం మర్చిపోవడంతో బాధితురాలు తప్పించుకుని పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు.