1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
  4. Nepal crime news

ప్రేమ జంటకు వింత శిక్ష.. మోకాళ్లు అరిగేలా గుంజీలు తీయించారు..

ఓ యువ ప్రేమ జంటపై బీహార్‌లోని సుపౌల్‌లో దారుణంగా ప్రవర్తించారు. ప్రేమించి పెళ్లి చేసుకున్నారనే కోపంతో ఆ గ్రామ పెద్దలు.. వింత శిక్ష విధించారు. కొత్త దంపతుల చేత మోకాళ్లు అరిగేలా గుంజీలు తీయించారు. గ్రామ

Nepal
ఓ యువ ప్రేమ జంటపై బీహార్‌లోని సుపౌల్‌లో దారుణంగా ప్రవర్తించారు. ప్రేమించి పెళ్లి చేసుకున్నారనే కోపంతో ఆ గ్రామ పెద్దలు.. వింత శిక్ష విధించారు. కొత్త దంపతుల చేత మోకాళ్లు అరిగేలా గుంజీలు తీయించారు.

గ్రామస్తుల చేత అక్కడి నేలపై ఉమ్మి వేయించి.. రూ.11వేల చొప్పున జరిమానా విధించారు. వివరాల్లోకి వెళితే, నేపాల్‌కు చెందిన మౌరానా అనే యువతి, బడ్ హరా సమీపంలోని తన తాతయ్యను ఇంట్లో వుంటోంది.
 
అదే ప్రాంతానికి చెందిన సంజీత్ కుమార్ ఆమెను ప్రేమించాడు. ఆమె కూడా అంగీకరించడంతో ఇద్దరూ ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరి పెళ్లికి ఇరు కుటుంబాల పెద్దలు అంగీకరించారు. కానీ గ్రామ పెద్దలు మాత్రం వీరి పెళ్లికి ససేమిరా అన్నారు. కొత్త దంపతులకు గుంజీల శిక్ష విధించారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.
About Writer
selvi
తర్వాతి కథనం
హేతుబద్ధత లేకుండా రాష్ట్ర విభజన జరిగింది : నరసింహన్