సంబంధిత వార్తలు
- ఆ సంబంధానికి అడ్డొస్తున్నాడని భర్తకు మద్యం తాగించి ప్రియుడుతో కలసి...
- గుట్కాతో తిరుమలకు తమిళ తంబీలు... వద్దంటే వాదన... చితకబాదారు...
- తెలంగాణాలో ఆపరేషన్ బిజెపి... ఆ పార్టీ నేతలు క్యూలో ఉన్నారట..
- ఆదివారం నువ్వుల నూనెతో తలంటు స్నానం వద్దే వద్దు..
- 5కేజీలు.. డ్రోన్లతో ఫుడ్ డెలివరీ.. జొమాటో ప్రయోగం సక్సెస్..
ఏసీలో చల్ల చల్లగా.. కూల్ కూల్‌గా కాపురం చేసిన పాము.. ఎక్కడ?
ఈ ఏడాది వేసవికాలంలో ఎండలు వామ్మో అనిపించాయి. ఉష్ణోగ్రతలు భారీగా నమోదయ్యాయి. తెలుగు రాష్ట్రాలు వేసవి ఎండలకు భగభగమండిపోతున్నాయి. ఏసీలు లేకుండా ఇళ్లల్లో వుండలేకపోతున్నారు చాలామంది. అలాంటి ఏసీల్లో చల్లచల్లగా కూల్ కూల్‌గా మనుషులే కాదు.. మేమూ వుంటామని చెప్తున్నాయి పాములు.
అవునండి.. ఇప్పటికే ఏసీల్లో పాములు చిక్కుపోయిన ఎన్నో ఘటనలు వినేవుంటాం. అయితే తాజాగా పుదుచ్చేరిలోని ఓ ఇంట్లో ఏసీలో హాయిగా వుండిపోయిన ఓ పామును ఏసీ మెకానిక్ బయటికి తీశాడు. వివరాల్లోకి వెళితే.. పుదుచ్చేరి, తేంగాయ్‌తిట్టు ప్రాంతానికి చెందిన ఏళుమలై.. ఇంట్లోని ఏసీని ఆన్ చేశాడు.
అయితే ఏసీ నుంచి ఏదో వెరైటీ సౌండ్ రావడంతో ఆపేశాడు. వెంటనే ఏసీ మెకానిక్‌ను పిలిపించాడు. మెకానిక్ కూడా ఏసీ పైకప్పు తీసి.. లోపాన్ని పరిశీలిస్తుండగా అతను షాకయ్యాడు.
ఏసీలో హాయిగా కాపురం చేస్తున్న పామును చూసి జడుసుకున్నాడు. ఆపై ఏళుమలై అటవీ శాఖాధికారులకు సమాచారం ఇవ్వడంతో.. సిబ్బంది హుటాహుటిన ఏళుమలై ఇంటికి చేరుకున్నారు. ఏసీలోని పామును పట్టుకున్నారు. ఆపై అడవిలో వదిలిపెట్టారు. ఈ ఘటన స్థానికుల్లో కలకలం రేపింది.
