మంగళవారం, 7 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By జె
Last Modified: గురువారం, 13 జూన్ 2019 (18:33 IST)

తెలంగాణాలో ఆపరేషన్ బిజెపి... ఆ పార్టీ నేతలు క్యూలో ఉన్నారట..

తెలంగాణాలో ఆపరేషన్ ఆకర్ష్‌ని బిజెపి ప్రారంభించింది. గత కొన్నిరోజుల ముందు వరకు ఎపిలో సాగిన ఆపరేషన్ ఆకర్ష్ ఇప్పుడు తెలంగాణాను తాకింది. కాంగ్రెస్, టిఆర్ఎస్ పార్గీ లోని నేతలందరినీ బిజెపిలోకి ఆహ్వానించేస్తున్నారు. ఇప్పటికే కమలం పార్టీ హైకమాండ్‌తో పలువురు నేతలు చర్చలు జరిపారు.
 
వచ్చే ఎన్నికల నాటికి తెలుగు రాష్ట్రాల్లో బలపడేందేందుకు వ్యూహరచన చేస్తోంది బిజెపి. ఇందులోభాగంగా ఇప్పటికే తెలంగాణాలో ఆపరేషన్ ఆకర్ష్‌ను మొదలుపెట్టింది. ఇప్పటికి కాంగ్రెస్ నేతలే టార్గెట్‌గా టిఆర్ఎస్ నేతలు చేస్తున్న పనితో ఆ పార్టీలో ముఖ్య నేతలే లేకుండా పోతున్నారు. ఇదే బాటలో బిజెపి కూడా తమ పార్టీ తలుపులు బార్లా తెరిచి కాంగ్రెస్ పార్టీకి చెందిన ముఖ్య నేతలను పిలవడంతో కొంతమంది నేతలు అటుగా చూస్తున్నారు.
 
అంతేకాకుండా టిడిపి నేతలకు కూడా బిజెపి గాలం వేస్తోంది. దీంతో రెండు పార్టీల నుంచి వెళ్ళే వారి సంఖ్య పెరిగే అవకాశం కనిపిస్తోంది. గడిచిన రెండుమూడు రోజులుగా టి.కాంగ్రెస్, ట.టిడిపి నేతల నుంచి కొంతమంది నేతలు చర్చలు జరుపుతున్నారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన ఇద్దరు ముఖ్య నేతలు రాంమాధవ్‌ను కలిసినట్లు సమాచారం. ఇటీవల ఓడిపోయిన ఇద్దరు, ముగ్గురు కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా సిద్థంగా ఉన్నారట.
 
మరోవైపు తెలంగాణా టిడిపిలో మిగిలిన నాయకులు సైతం ఖాళీ అవుతున్నారు. ఏకంగా పార్టీ ఆఫీస్‌లనే వేదికగా చేసుకుని రాజీనామా చేసేస్తున్నామని ప్రకటించేస్తున్నారు. టిడిపి రాజ్యసభ్య సభ్యుడు ఒకరు బిజెపితో చేరుతానని సూత్రప్రాయంగా చెప్పినట్లు తెలుస్తోంది. టి.టిడిపి నేతలు బిజెపి నేతలతో భేటీ కూడా అయ్యారట.