మంగళవారం, 7 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By శ్రీ
Last Modified: మంగళవారం, 11 జూన్ 2019 (18:48 IST)

సీఎం జగన్‌కి ప్రధాని మోదీ పెద్దపీట... డిప్యూటీ స్పీకర్ పదవి?

దక్షిణాది రాష్ట్రాలలో అత్యధిక ఎంపీ సీట్లు గెలుచుకున్న పార్టీ వైసీపి. ఇపుడా పార్టీ చీఫ్, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ప్రధానమంత్రి కేంద్రంలో పెద్దపీట వేస్తున్నట్లు చెప్పుకుంటున్నారు. ముఖ్యంగా ఆ పార్టీకి చెందిన ఎంపీల్లో ఒకరికి డిప్యూటీ స్పీకర్ పదవి ఇస్తారంటూ ప్రచారం సాగుతోంది. 
 
ఇందులో భాగంగా భాజపా నాయకుడు, రాజ్యసభ సభ్యుడు జివిఎల్ ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిని కలిశారంటూ వార్తలు వస్తున్నాయి. ఐతే జీవీఎల్ మాత్రం ముఖ్యమంత్రిని మర్యాదపూర్వకంగా కలిశాను.. రాష్ట్ర అభివృద్ధి, సమస్యలపై మాట్లాడాను.. రాష్ట్ర ప్రయోజనాలు, కేంద్ర ప్రభుత్వంతో సహకారంపై చర్చించినట్లు చెప్పారు.
 
తమ మధ్య రాజకీయాలపై ఎలాంటి చర్చ జరుగలేదన్నారు. స్పెక్యులేషన్‌లకు తను సమాధానం చెప్పలేననీ, డిప్యూటీ స్పీకర్ పదవి వైసీపీ ఎంపీకి ఇవ్వడం విషయంపై తనకు సమాచారం లేదన్నారు. ఇలాంటివన్నీ బీజేపీ అధిష్టానం నిర్ణయిస్తుందని వెల్లడించారు.