శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జె
Last Modified: సోమవారం, 10 జూన్ 2019 (17:53 IST)

సీఎం జగన్ మోహన్ రెడ్డికి అది ఇస్తా... బిజెపి నేత, సినీ నటి కవిత

తెలుగుదేశం పార్టీతో పాటు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుపై తీవ్రస్థాయిలో వ్యాఖ్యలు చేశారు బిజెపి నేత, సినీనటి కవిత. గత ఎన్నికల్లో గెలిచేందుకు కోట్ల రూపాయల డబ్బులు టిడిపి నేతలు ఖర్చు పెట్టారని, రాక్షస, అవినీతి, అక్రమ పాలన మాకొద్దంటూ ప్రజలు చంద్రబాబుకు సరైన బుద్ధి చెప్పారన్నారు. జగన్ పైన ప్రజల్లో నమ్మకం ఏర్పడిందని, అందుకే భారీ మెజారిటీతో గెలిపించారని చెప్పుకొచ్చారు.
 
చంద్రబాబుకు అహంకారం ఎక్కువని, అహంకారం మనిషికి అస్సలు పనికిరాదని, అందుకే దేవుడు చంద్రబాబును ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టాడని విమర్సించారు. ఇప్పటికే తెలంగాణాలో టిడిపి జెండాను పీకేశారు. 2024 సంవత్సరం నాటికి పూర్తిగా తెదేపా జెండాను పీకేయడం ఖాయమని జోస్యం చెప్పారు. 
 
అవినీతి లేని పాలన అందించాలని త్వరలో జగన్ మోహన్ రెడ్డిని కలిసి వినతిపత్రం అందిస్తానన్నారు సినీనటి కవిత. తిరుమల శ్రీవారిని ఈరోజు దర్శించుకున్న కవిత ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడారు.