1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
  4. Sushma Swaraj 70th birth anniversary

నేడు సుష్మా స్వరాజ్ జయంతి - బీజేపీ నేతల నివాళులు

Sushma Swaraj 70th birth anniversary
భారతీయ జనతా పార్టీ సీనియర్ మహిళా నేత, కేంద్ర మాజీ మంత్రి  సుష్మాస్వరాజ్ 70వ జయంతి వేడుకలు సోమవారం జరుగుతున్నాయి. దీంతో ఆమెకు పలు చోట్ల బీజేపీ శ్రేణులు నివాళులు అర్పిస్తున్నారు. 
 
గతంలో మాజీ ప్రధాని అటల్ బీహారీ వాజపేయి ప్రభుత్వం కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రిగా ఆరోగ్యశాఖలో అనేక సంస్కరణలు తీసుకువచ్చిన సుష్మా స్వరాజ్.. ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వంలో భారత విదేశాంగ మంత్రిగా భారత దేశ దౌత్యనీతితో ప్రపంచంలోని అన్నిదేశాలతో మంచి సత్సంబంధాలు నెలకొల్పడంలో పాత్ర కీలకమైనది.
 
ప్రపంచంలోని ఏ దేశంలోనైనా భారతీయులు ముఖ్యంగా గల్ఫ్ దేశాల్లోని తెలుగువారు ఇబ్బందులకు గురైతే వారు వెంటనే స్పందించి ఆయా దేశాల మంత్రులతో చర్చించి ఆ సమస్యలను వెంటనే పరిష్కరించారు. ఆమె అనారోగ్యంతో బాధపడుతున్నప్పటికీ ట్విట్టర్ మాధ్యమం ద్వారా అందరికీ అందుబాటులో ఉండి వారి సమస్యలపై వెంటనే స్పందించి అనేక మంది మన్నలు పొందారు. 
తర్వాతి కథనం
భారత్-పాకిస్థాన్‌ సంబంధాల బ్రేక్‌కు ఆర్ఎస్ఎస్ భావజాలమే కారణం!