1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
  4. TN CM Vijay Strong Warning Over DMK's Corruption

టచ్ చేయాలని చూస్తే జీవితాంతం బాధపడతారు : డీఎంకేకు సీఎం విజయ్ వార్నింగ్

Vijay
Vijay
మాజీ ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ సారథ్యంలోని డీఎంకేకు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ మరోమారు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. తనను టచ్ చేయాలని చూడొద్దని, తనను టచ్ చేస్తే జీవితాంతం బాధపడతారని ఆయన హెచ్చరించారు. 
 
తమిళనాడు రాష్ట్రంలో తారాపురం, మధురాంతకం అసెంబ్లీ స్థానాలకు వచ్చే నెలలో ఉప ఎన్నికలు జరుగనున్నాయి. ఉప ఎన్నికల నేపథ్యంలో టీవీకే అభ్యర్థి కుమారవేల్‌కు మద్దతుగా మధురాంతకంలో విజయ్ ప్రచారం చేశారు. అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగసభలో విజయ్ మాట్లాడుతూ... జయలలితను స్టాలిన్ విమర్శించిన వీడియో ఇప్పటికీ వైరల్ అవుతోందని చెప్పారు. ఆయనతో పాటు ఆయన కుటుంబ సభ్యులు, ఆయన పార్టీలో ఉన్న పెద్ద నాయకులు కూడా ఇలాగే మహిళలను కించపరుస్తూ మాట్లాడుతున్నారని విమర్శించారు. 
 
డీఎంకే నేతల వ్యాఖ్యలకు పరోక్షంగా పలువురు మద్దతిస్తున్నారని మండిపడ్డారు. ఆ పలువురు ఎవరో తెలుసు కదా? అని ప్రశ్నిస్తూ... ఆ పలువురు అన్నాడీఎంకే నేతలు అని అన్నారు. స్టాలిన్‌కు, డీఎంకేకు ఒకటే చెబుతున్నానని... అవినీతికి పాల్పడిన ముఠాను వదిలిపెట్టే ప్రసక్తే లేదని హెచ్చరించారు. గతంలో జయలలితకు డీఎంకేనే ప్రధాన శత్రువని, నేడు టీవీకేకు కూడా డీఎంకేనే శత్రువని అన్నారు. లోక్‌సభలో నియోజకవర్గాల బిల్లు వస్తే మద్దతు ఇచ్చేందుకు డీఎంకే ఆత్రుతగా తహతహలాడుతోందని ఎద్దేవా చేశారు. 
About Writer
ఠాగూర్
ఠాగూర్ పులపాక ప్రముఖ దినపత్రిక ఈనాడు, చెన్నై కార్యాలయంలో 'న్యూస్ కాంట్రిబ్యూటర్‌'గా జర్నలిజం ఓనమాలు నేర్చుకున్నారు. హైదరాబాద్ కార్యాలయంలో 'ఆంధ్రజ్యోతి' సబ్-ఎడిటర్ పని చేశారు. 2007 నుంచి 'వెబ్ దునియా'లో అసిస్టెంట్ ఎడిటర్‌‌గా విధులు నిర్వహిస్తున్నారు..... మరింత చదవండి
తర్వాతి కథనం
రన్‌వేపై ఢీకొన్న రెండు విమానాలు - 379 మందికి తప్పిన ప్రమాదం