1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
  4. Train Accident Video : Man Electrocuted On Train

రైలు బోగీలపై నడిచిన యువకుడు - హైటెన్షన్ విద్యుత్ వైరు తగ్గి... (Video)

Man Electrocuted On Train
కొందరు యువకులు చేసే పనులు చివరకు ప్రాణాలమీదికి తెచ్చుకుంటుంటారు. కొందరు సాహసాలు చేసి ప్రాణాలు కోల్పోతుంటే మరొందరు మూర్ఖంగా ప్రవర్తించి చనిపోతున్నారు. తాజా ఓ యువకుడు రైలు బోగీలపై నడిచాడు. హైటెన్షన్ విద్యుత్ వైర్లు తగలడంతో ప్రాణాలు కోల్పోయాడు. అయితే, ఈ ఘటన ఎక్కడ జరిగిందో తెలియదుగానీ వీడియో మాత్రం వైరల్ అయింది. 
 
ఓ యువకుడు రైలు బోగీపైకి ఎక్కి నడుచుకుంటూ వెళుతున్నాడు. అతన్ని చూసిన కొందరు ఎంత అరిచినా ఏమాత్రం పట్టించుకోలేదు. అలా నడుచుకుంటూ వెళుతుండగా రైలుపై ఉండే హైటెన్షన్ విద్యుత్ లైన్లు తగులుకుని పెద్ద ఎత్తున మంటలు వ్యాపించడంతో అతడు అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. దీనికి సంబంధించిన వీడియో మాత్రం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 

 
తర్వాతి కథనం
తండ్రి మృతదేహం వద్దే ప్రియురాలి మెడలో తాళికట్టిన యువకుడు (Video)