1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
  4. Benefits of Lighting Lamp - BrahmaMuhurtam on Friday

శుక్రవారం బ్రహ్మముహూర్త కాలం దీపం వెలిగించి.. ఇలా చేస్తే?

Kamakshi
శుక్రవారం బ్రహ్మ ముహూర్త సమయంలో మాత్రమే ఇంట్లో పూజలు చేస్తే అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయి. ఇంట శాంతియుత వాతావరణం నెలకొంటుంది. అనవసర సమస్యలు పారిపోతాయి. అందుకే ఇంట్లోని మహిళలు శుక్రవారం బ్రహ్మముహూర్త కాలంలో పూజలు చేయాలి. 
 
శ్రీలక్ష్మిని ప్రసన్నం చేసుకోవాలి. శుక్రవారం అంటే గురువారం నాడు మహిళలు తమ ఇంటిని శుభ్రం చేసుకుంటారు. శుక్రవారం ఉదయం పూజకు అవసరమైన పువ్వులను పూజసామగ్రి సిద్ధం చేసుకుంటారు.
 
బ్రహ్మముహూర్తంలో ఉదయం తెల్లవారుజామున 4.30 గంటల నుంచి 5.30 గంటల్లోపు దీపం వెలిగించాలి. శ్రీలక్ష్మిని, పార్వతీదేవిని ప్రసన్నం చేసుకునేందుకు ఈ సమయం ఉత్తమమైంది. 
 
ఈ సమయంలో పూజ చేస్తే అన్నీ కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయి. అలాగే కళ్లు తెరిచి మనస్పూర్తిగా అమ్మవారిని ప్రార్థించాలి. ఇలా ప్రతి శుక్రవారం లేదా 3 వారాలు చేస్తే.. లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుందని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు. 
తర్వాతి కథనం
Chandra Grahan 2023: అన్నం, పెరుగు, పాలును తీసుకోకూడదా?