సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 7 ఏప్రియల్ 2023 (13:39 IST)

భారత్‌లో కొత్తగా 6,050 కోవిడ్‌ కేసులు- 24 గంటల్లో 2,334 డోస్‌లు

corona visus
దేశంలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో భారత్‌లో కొత్తగా 6,050 కోవిడ్‌ కేసులు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ శుక్రవారం వెల్లడించింది. అదే సమయంలో 3,320 రికవరీలతో, మొత్తం రికవరీల సంఖ్య 4,41,85,858కి చేరుకుంది. ప్రస్తుతం రికవరీ రేటు 98.75 శాతంగా ఉంది. రోజువారీ పాజిటివిటీ రేటు 3.39 శాతంగా ఉండగా, వారంవారీ పాజిటివిటీ రేటు 3.02 శాతంగా ఉంది.
 
ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 28,303గా ఉంది. ఇప్పటివరకు 1,78,533 మందికి పరీక్షలు నిర్వహించారు. మొత్తం పరీక్షల సంఖ్య 92.25 కోట్లకు చేరుకుంది. గత 24 గంటల్లో మొత్తం 2,334 డోస్‌లు ఇవ్వబడ్డాయి. దీంతో మొత్తం టీకాల సంఖ్య 220.66 కోట్లకు చేరుకుంది.