గురువారం, 26 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By రామన్
Last Updated : గురువారం, 25 ఏప్రియల్ 2019 (12:18 IST)

25-04-2019 గురువారం దినఫలాలు - సమస్యలు చిన్నవే అయినా...

మేషం: పారిశ్రామిక రంగం వారికి ఊహించని చికాకులెదురవుతాయి. సోదరీసోదరుల మధ్య సఖ్యతా లోపం, కలహాలు చోటు చేసుకుంటాయి. ఉద్యోగస్తులు సభలు, సమావేశాల్లో పాల్గొంటారు. స్త్రీలకు గృహంలో ఒక శుభకార్యం చేయాలన్న ఆలోచన స్పురిస్తుంది. నిరుద్యోగులకు ప్రముఖుల సహకారంతో సదవకాశాలు లభిస్తాయి.
 
వృషభం: కొన్ని సమస్యలు చిన్నవే అయిన మనశ్శాంతి దూరం చేస్తారు. ప్రముఖుల ఇంటర్వ్యూకోసం అధిక సమయం వేచి ఉండాల్సి వస్తుంది. సతీసమేతంగా ఒక పుణ్యక్షేత్రాన్ని సందర్శిస్తారు. మీ కుటుంబానికి మీరు అవసరం కనుక వ్యసనాలకు దూరంగా ఉండండి. ఆత్మీయులను విమర్మించుట వలన చికాకులను ఎదుర్కుంటారు.  
 
మిధునం: ఆర్థిక పరిస్థితి మెరుగుపడడంతో పాటు కొన్ని లక్ష్యాలు సాధిస్తారు. స్థిరచరాస్తుల క్రయవిక్రయాలు అనుకూలిస్తాయి. చేపట్టిన పనులలో చికాకులు, ఒత్తిడి ఎదుర్కోవలసి వస్తుంది. స్త్రీలు అందరినీ ఆకట్టుకుంటారు. విద్యార్థుల్లో మనోధైర్యం పెంపొందుతుంది. నిరుద్యోగ, వివాహ యత్నాలు ఫలిస్తాయి.
 
కర్కాటకం: ఉద్యోగస్తులకు పనిభారం, శ్రమాధిక్యత తప్పవు. ధనవ్యయం చెల్లింపులకు సంబంధించిన విషయాల్లో ఏకాగ్రత అవసరం. పెద్దల ఆరోగ్యం కోసం ధనం విరివిగా వ్యయమవుతుంది. చిన్నతరహా పరిశ్రమలు, చేతివృత్తుల వారికి కలిసిరాగలదు. వాహన సౌఖ్యం పొందుతారు. డాక్టర్లు శస్త్రచికిత్సలు విజయవంతంగా పూర్తిచేస్తారు.
 
సింహం: ప్రతీ విషయంలోను ఆచితూచి అడుగు వేయవలసి ఉంటుంది. పాతమిత్రుల కలయిక సంతృప్తినిస్తుంది. రావలసిన ధనం వసూళ్లల్లో శ్రమాధిక్యత, ప్రయాసలెదుర్కుంటారు. ఇంటర్వ్యూలలో ఏకాగ్రత వహించిన ఫలితం పొందుతారు. ఉద్యోగస్తులకు మార్పులు అనుకూలిస్తాయి. నూతన ప్రదేశాలను సందర్శిస్తారు. 
 
కన్య: స్త్రీలకు బంధువర్గాల నుండి వ్యతిరేకత, ఆరోగ్యంతో చికాకులు అధికమవుతాయి. ఊహించని ఖర్చుల వలన చేబదుళ్ళు తప్పవు. తీర్థయాత్రలు, విదేశీయాసం కోసం చేసే యత్నాల్లో ఆటంకాలు ఎదుర్కుంటారు. వ్యాపార వర్గాల వారికి పన్నులు, ప్రభుత్వ విధానాలు ఆందోళన కలిగిస్తాయి. నిరుద్యోగులు సదవకాశాలు జారవిడుచుకుంటారు. 
 
తుల: ఆర్థిక విషయాల్లో స్వల్ప ఒడిదుడుకులు తలెత్తిన నెమ్మదిగా సమసిపోతాయి. మీ బంధువులను సహాం అర్ధించే బదులు మీరే ప్రత్యామ్నాయం చూసుకోవడం ఉత్తమం. కుటుంబీకులతో ఉల్లాసంగా గడుపుతారు. మీ సంతానం కోసం ధనం అధికంగా వ్యయం చేస్తారు. స్త్రీలకు పనివారితో చికాకులు తప్పవు.
 
వృశ్చికం: బంధువుల రాకతో గృహంలో సందడి కానవస్తుంది. రాజకీయనాయకులు ప్రముఖులను కలుకుని బహుమతులు అందజేస్తారు. ఉత్తర ప్రత్యుత్తరాలు సంతృప్తిగా సాగుతాయి. స్త్రీలకు నడుము, తల, నరాలకు సంబంధించిన చికాకులు అధికమవుతాయి. ప్రతి పని చేతివరకు వచ్చి వెనక్కి పోవుటవలన ఆందోళన పెరుగుతుంది. 
 
ధనస్సు: మీ అభిరుచులకు తగిన విధంగా కుటుంబ సభ్యులు మసలుకుంటారు. సందర్భానుకూలంగా సంభాషించి సమస్యలకు దూరంగా ఉండండి. ఊహించని ఖర్చులు మీ అంచనాలు దాటగలవు. పాతిబాకీలు అనుకోకుండా వసూలవుతాయి. స్త్రీలతో సంభాషించేటపుడు సంయమనం పాటించండి. ఆలయాలను సందర్శిస్తారు. 
 
మకరం: పెద్దమొత్తం ధనం, నగదుతో ప్రయాణాలు మంచిదికాదు. సమయస్తూపూర్తిగా వ్యవహరించి ఒక సమస్యను అధిగమిస్తారు. సంఘంలో పలుకుబడి కలిగిన వ్యక్తుల సహాయ సహకారాలు అందుతాయి. మీ ప్రత్యర్థులు వేసే పథకాలు దీటుగా ఎదుర్కుంటారు. అందరితో కలిసి విందు, వినోదాలలో పాల్గొంటారు. 
 
కుంభం: సోదరీసోదరులతో సంబంధాలు బలపడుతాయి. ప్రత్తి, పొగాకు వ్యాపారులకు ఆశాజనకంగా ఉంటుంది. స్త్రీలకు అలంకారాలు, విలాస వస్తువుల పట్ల మక్కువ పెరుగుతుంది. ధనం కంటే ఆత్మగౌరవానికే ప్రాధాన్యం ఇస్తారు. నిరుద్యోగులకు అవకాశం చేజారిపోయే ఆస్కారం ఉంది. జాగ్రత్త వహించండి. 
 
మీనం: స్త్రీలకు పనిభారం అధికమవ్వడం వలన ఆరోగ్యం మందగిస్తుంది. క్రయవిక్రయ రంగాలపట్ల ఆసక్తి పెరుగుతుంది. ప్రింటింగ్, స్టేషనరీ రంగాలలోవారికి పనిభారం అధికం. వ్యాపారులకు పోటీ పెరగటంతో ఆశించినంత పురోభివృద్ధి ఉండదు. మీ కళత్ర మొండివైఖరి వలన కుటుంబ సౌఖ్యం లోపిస్తుంది.