గురువారం, 26 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By రామన్
Last Updated : మంగళవారం, 23 ఏప్రియల్ 2019 (08:49 IST)

23-04-2019 మంగళవారం దినఫలాలు - కోర్టు వ్యవహారాలు...

మేషం: కోర్టు వ్యవహారాలు వాయిదా పడడం మంచిది. కుటుంబీకులతో సరదాగా గడుపుతారు. మత్స్య, కోళ్ళ వ్యాపారస్తులకు సామాన్యంగా ఉంటుంది. పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. ఏ విషయంలోను హామీ ఇవ్వకుండా లౌక్యంగా వ్యవహరించండి. వాహనం ఇతరులకు ఇచ్చే విషయంలో లౌక్యంగా వ్యవహరించండి.
 
వృషభం: ఖర్చులు అధికమైనా మీ ఆర్థికస్థితికి ఏ మాత్రం లోటుండదు. బంధువులు మీ స్థితిగతులను చూచి అసూయపడే ఆస్కారం ఉంది. జాగ్రత్త వహించండి. వాతావరణంలో మార్పు మీకెంతో చికాకు కలిగించగలదు. దైవ కార్యక్రమాల పట్ల ఏకాగ్రత వహిస్తారు. కొంతమంది మిమ్మల్ని ధనసహాయం అర్ధించవచ్చును.
 
మిధునం: స్త్రీల ఓర్పు, నేర్పుకు పరీక్షా సమయమని గమనించగలరు. ప్రింటింగ్ రంగాల వారికి బాకీల వసూళ్ళల్లో శ్రమాధిక్యత, ప్రయాసలు తప్పవు. మధ్య, మధ్య ఔషధ సేవ తప్పదు. రాజకీయాల్లోవారికి కార్యకర్తల పట్ల సమస్యలు తలెత్తుతాయి. ఊహించని సమస్యలు తలెత్తుటవలన పొదుపు ఆవశ్యకత గుర్తుకువస్తుంది.
 
కర్కాటకం: ఒక కార్యార్ధమై దూరప్రయాణం చేయవలసి వస్తుంది. చిన్నతరహా పరిశ్రమలు, చిరువృత్తుల వారికి శ్రమాధిక్యత. ఉద్యోగస్తులకు ఒక అవకాశం చేతివరకు వచ్చి వెనక్కి పోయే ఆస్కారం ఉంది. అతిధి మర్యాదలు బాగుగా నిర్వహిస్తారు. రిప్రజెంటేటివ్‌లకు, పత్రికా, ప్రైవేటు సంస్థల్లోని వారికి మార్పులు అనుకూలించవు.
 
సింహం: ఆర్థిక ఇబ్బంది అంటూ ఏదీ ఉండదు. మీ పట్ల ముభావంగా ఉండే వ్యక్తులు మీ సాన్నిత్యం కోరుకుంటారు. ఇతరుల కారణంగా మీ కార్యక్రమాలు వాయిదా పడుతాయి. ఆపతసమయంలో ఒకరిని ఆదుకోవడం వలన ఆదరణ, గుర్తింపు లభిస్తుంది. ప్రేమికుల అనాలోచిత నిర్ణయాల వలన సమస్యలెదురవుతాయి.
 
కన్య: ప్రైవేటు సంస్థల్లోని వారికి ఓర్పు, అంకితభావంతో పనిచేయవలసి ఉంటుంది. దైవ, సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. ప్రయాణాలలో నూతన పరిచయాలేర్పడుతాయి. కళకారులకు, రచయితలకు, అభిమానబృందాలు అధికం కాగలవు. ధనం ఏమాత్రం నిల్వ చేయలేకపోవడం వలన ఆందోళనకు గురవుతారు. 
 
తుల: నిర్మాణ పనులు సంతృప్తికరంగా పూర్తికాగలవు. విదేశీయాన యత్నాలు సఫలీకృతులౌతారు. ఇతరులకు మీ వస్తువులను తస్కరించడానికి ఆస్కారం ఉంది. జాగ్రత్త వహించండి. ఆరోగ్య, ఆహార విషయాల్లో మెళకువ అవసరం. ఉద్యోగస్తులకు ఇతరుల కారణంగా మాటపడక తప్పదు. సంఘంలో మీ స్థాయి పెరుగుతుంది.
 
వృశ్చికం: ఆర్థిక లావాదేవీలు ఒక కొలిక్కి రాగలవు. జీవిత భాగస్వామితో కలహాలు రాకుండా సంయమనంతో వ్యవహరించవలసి ఉంటుంది. వ్యవసాయ, తోటల రంగాల్లో వారికి సంతృప్తి కానరాదు. ఆధ్యాత్మిక కార్యక్రమాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. మీ వాక్‌చాతుర్యానికి, మంచితనానికి గుర్తింపు లభిస్తుంది. 
 
ధనస్సు: సమయానికి ధనం సర్దుబాటు కాకపోవడం వలన ఒకింత ఇబ్బందులు తప్పవు. కోర్టు వ్యవహారాలు, వాణిజ్య ఒప్పందాల్లో మెళకువ వహించండి. ప్రైవేటు సంస్థల్లోని వారికి యాజమాన్యం తీరు నిరుత్సాహం కలిగిస్తుంది. నిరుద్యోగుల యత్నాలు అనుకూలిస్తాయి. దూరప్రయాణాలు అనుకూలిస్తాయి. 
 
మకరం: స్త్రీలు కొన్ని నిర్భందాలకు లోనవుతారు. ప్రేమికులకు మధ్య అభిప్రాయబేధాలు తలెత్తుతాయి. నిరుద్యోగుల కృషికి తగిన ప్రతిఫలం త్వరలోనే లభిస్తుంది. విద్యార్థులకు సైన్సు, గణిత, టెక్నికల్, కంప్యూటర్ రంగాల్లో ప్రవేశం లభిస్తుంది. వృత్తుల వారికి చికాకులు, ఒత్తిడిలు తప్పవు. పాతమిత్రులను కలుసుకుంటారు. 
 
కుంభం: ఆర్థిక విషయాలలో ఒకడుగు ముందుకు వేస్తారు. కుటుంబీకుల అభివృద్ది కోసం పథకాలు వేస్తారు. నూతన అగ్రివెంట్లకు అనుకూలం. ఉపాధ్యాయులకు నూతన అవకాశాలు లభిస్తాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగును. ట్రాన్స్‌పోర్ట్, ఆటోమొబైల్ రంగాలవారికి కలిసివచ్చేకాలం. చిరు వ్యాపారులకు లాభం. 
 
మీనం: బంధుమిత్రుల రాకపోకలు పెరుగుతాయి. విద్యుత్ రంగాలవారికి విశ్రాంతి లభిస్తుంది. మధ్యవర్తిత్వం వహించుట వలన సమస్యలను ఎదుర్కుంటారు. ప్రియతములలో మార్పు మీకు ఎంతో ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. కొంతమంది ఆర్థిక సహాయం అర్ధిస్తారు. పాత వ్యవహారాలకు పరిష్కారమార్గం దొరుకుతుంది.