శుక్రవారం, 29 మార్చి 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By
Last Updated : శుక్రవారం, 14 డిశెంబరు 2018 (18:33 IST)

స్త్రీలకు ఆ భాగంలో పుట్టుమచ్చ ఉన్నచో.. పుత్ర సంతానం..?

పుట్టుమచ్చ అందాన్ని రెట్టింపు చేస్తుంది. ఈ మచ్చ ఒక్క ప్రాతం అని కాదు.. ఎక్కడి పడితే అక్కడ వచ్చేస్తుంది. పుట్టుమచ్చలు ప్రతీఒక్కరిలో తప్పకుండా ఉంటాయి. కొన్ని పుట్టుమచ్చలు మంచి చేసేలా ఉంటాయి. మరికొన్ని చెడును కలిగించేలా ఉంటాయి. మరి శాస్త్రం ప్రకారం స్త్రీలకు ముఖ భాగంలో పుట్టుమచ్చ ఉంటే కలిగే లాభాలు, నష్టాలు తెలుసుకుందాం.
 
ముఖానికి కింది భాగాన తేనె రంగులో మచ్చ ఉన్నచో ఆ స్త్రీ ఇతరులను ఆదరించు స్వభావం కలిగి ఉంటుంది. ఆ మచ్చ ఎర్రగానున్నచో కోప స్వభావం కలిగియుండును. నల్లని మచ్చ దుష్టస్వభావం, క్రూరత్వమును కలుగజేయును. ఫాల భాగం నందు పుట్టుమచ్చ ఉన్నచో సంతాన ప్రాప్తి, ఐశ్వర్యాభివృద్ధి చేకూరుతుంది. ఫాల భాగాన కనుబొమల మధ్య మచ్చ ఉన్నచో.. రాజుభార్య అవుతారు. 
 
ఎడమ చెక్కిలి మీద ఎర్రని మచ్చ ఉంటే.. సదా మృష్టాన్న భోజనప్రాప్తి కలుగును. ఎడమ కంటి మీద మచ్చ ఉన్నచో.. మిత్ర విరోధం, సంతాన విరోధం, దరిద్రం, మితసౌఖ్యం కలుగజేయును. చెవిమీద గానీ, కంటిమీద గానీ పుట్టుమచ్చ ఉన్నచో.. మొదట పుత్ర సంతానం కలుగును. కుడి కణత మీద ఎర్రని మచ్చ గానీ, పాండువర్ణం మచ్చగానీ ఉన్నచో మంచి ప్రవర్తన కలిగియుండును.