మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By రామన్
Last Updated : శుక్రవారం, 14 డిశెంబరు 2018 (08:49 IST)

14-12-2018 శుక్రవారం దినఫలాలు - వృత్తి, ఉద్యోగాల్లో కొంత పురోగతి...

మేషం: పురోగతి లేని వృత్తి ఉద్యోగాలు విసుగు కలిగిస్తాయి. దైవ కార్యక్రమాల పట్ల చురుకుగా పాల్గొంటారు. కానివేళలో ఇతరుల రాక ఇబ్బంది కలిగిస్తుంది. బ్యాంకు వ్యవహారాలలో అపరిచిత వ్యక్తుల పట్ల అప్రమత్తంగా వ్యవహరించండి. ట్రాన్స్‌‍పోర్ట్, ఆటోమోబైల్, మెకానికల్ రంగాల్లో వారికి ఒత్తిడి తప్పదు. 
 
వృషభం: గృహంలో మార్పులు చేర్పు వాయిదాపడుతాయి. విద్యార్థులకు చదువుపట్ల ఏకాగ్రత చాలా అవసరం. స్టేషనరీ, ప్రింటింగ్ రంగాలలో వారికి ఒత్తిడి పెరుగుతుంది. నూతన టెండర్ల విషయంలో ప్రతికూలతలు, చికాకులు ఎదురవుతాయి. బంధుమిత్రులతో కీలకమైన విషయాలు చర్చలు జరుపుతారు.  
 
మిధునం: ఆర్ధిక పరిస్థితి మెరుగుపడుతుంది. వృత్తి, ఉద్యోగాల్లో కొంత పురోగతి ఉంటుంది. స్థిరచారాస్తుల విషయంలో ఒక నిర్ణయానికి రాగలుగుతారు. పాత మిత్రులను కలుసుకుంటారు. సైన్సు, గణిత, ఎలక్ట్రానికల్ రంగాల్లో వారికి పురోభివృద్ధి కానవరాగలదు. వాహనం ఇతరులకు ఇచ్చి ఇబ్బందులను ఎదుర్కుంటారు.  
 
కర్కాటకం: ఉద్యోగస్తులకు పై అధికారులతో సమస్వయం లోపిస్తుంది. కోర్టు వ్యవహారాల్లో ప్లీడర్లకు చికాకులు తప్పవు. మీ కార్యక్రమాలలో స్వల్ప మార్పులుంటాయి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. పోస్టల్, టెలిగ్రాఫ్ రంగాల వారికి ఒత్తిడి పెరుగుతుంది. స్త్రీలకు సంపాదనపై ఆసక్తి పెరుగుతుంది.   
 
సింహం: విద్యార్థుల లక్ష్యసాధనకు నిరంతర కృషి అవసరం. దైవ దర్శనాలు, మొక్కుబడులు అనుకూలిస్తాయి. భాగస్వామ్య వ్యాపారస్తులకు పరస్పర అవగాహన అభివృద్ధి కానవస్తుంది. స్త్రీలకు అనవసర ప్రసంగాలు అపార్ధాలకు దారితీస్తాయి. దూరప్రయాణాలలో అపరిచితుల పట్ల అప్రమత్తత అవసరం.  
 
కన్య: బ్యాంకింగ్, చిట్క్, పైనాన్స్ రంగాల్లో వారికి మెళకువ అవసరం. ప్రత్తి, పొగాకు, నూనె వ్యాపారస్తులకు స్టాకిస్టులకు ఆశాజనకం. ఉద్యోగస్తులు పై అధికారులతో మితంగా సంభాషించడం క్షేమదాయకం. దృఢ నిశ్చయంతోనే మీ ఆశయం సిద్ధిస్తుంది. ఉపాధ్యాయులకు మార్కెటింగ్ రంగాల వారికి సదవకాశాలు లభిస్తాయి.   
 
తుల: మీకు, బంధువులకు మధ్య తలెత్తిన కలతలన్నీ దూరమై అంతా కలిసిపోతారు. విద్యార్థినులు ప్రేమ వ్యవహారలకు దూరంగా ఉండడం మంచిది. ఆకస్మిక దూరప్రయాణాలు తప్పవు. కొబ్బరి, పండ్లు, పూల వ్యాపారులకు లాభసాటిగా ఉంటుంది. నూతన వ్యాపారాలు కొంతకాలం వాయిదా వేయడం మంచిది.  
 
వృశ్చికం: ఆర్థిక విషయాల్లో ఒడిదుకులు ఎదుర్కుంటారు. వ్యాపారాభివృద్ధికి మరింతగా శ్రమించవలసివస్తుంది. పీచు, ఫోం, లెదర్ పరిశ్రమల వారికి ఆశాజనకం. విదేశాలు వెళ్ళడానికి చేసే యత్నాలు వాయిదాపడుతాయి. శ్రీమతి పోరుతో కొత్త యత్నాలు మొదలెడతారు. పాత రుణాలు తీర్చగలుగుతారు.  
 
ధనస్సు: ఆహార, వ్యవహారాల్లో మెళకువ వహించండి. ప్రైవేటు సంస్థల్లో వారు మార్పులకై చేయు ప్రయత్నాలు అనుకూలిస్తాయి. స్త్రీలకు పనివారలతో చికాకు, ఒత్తిడి తప్పవు. ఉపాధి పథకాల దిశగా నిరుద్యోగుల ఆలోచనలుంటాయి. ఇప్పటివరకు మిమ్మల్ని తక్కువ అంచనా వేసిన వారు మీ సహాయం అర్థిస్తారు.  
 
మకరం: మీ మనోవాంఛ నెరవేరే సమయం ఆసన్నమైందని గమనించండి ఆడిటర్లకు, వైద్యులకు సంతృప్తి, లాయర్లకు చికాకులు తప్పవు. రాజకీయా్లో వారికి కార్యకర్తల వలన సమస్యలు తప్పవు. కాంట్రాక్టర్లకు నూతన టెండర్ల వ్యవహారాలలో పునరాలోచన అవసరం. దైవ కార్యక్రమాల పట్ల చురుకుగా పాల్గొంటారు.     
 
కుంభం: ప్రతిఫలాపేక్ష లేకుండా మీరు చేసి సాయానికి సంఘంలో మంచి గుర్తింపు, రాణింపు లభిస్తుంది. ఆదాయాన్ని పెంచుకునేందుకు చేసే యత్నాల్లో సఫలీకృతులవుతారు. కొంతమంది మీ పనులకు ఆటంకం కలిగిస్తారు. ఒక్కోసారి మీ జీవిత భాగస్వామి మనస్థత్వం అర్థం చేసుకోవడం కష్టమవుతుంది.    
 
మీనం: కొన్ని సమస్యలు చిన్నవే అయినా మనశ్శాంతి దూరం చేస్తుంది. స్త్రీల ఓర్పు, నేర్పుకు పరీక్షా సమయం అని గమనించండి. ప్రింటింగ్ రంగాల వారు ఒత్తిడి, చికాకులను ఎదుర్కొనక తప్పదు. రాబడికి మించిన ఖర్చులెదురైనా తట్టుకుంటారు. పాతమిత్రుల కలయికతో గత విషయాలు జ్ఞప్తికి రాగలవు.