మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By రామన్
Last Updated : మంగళవారం, 11 డిశెంబరు 2018 (07:54 IST)

11-12-2018 మంగళవారం దినఫలాలు : వృత్తి, ఉద్యోగాల్లో కొంత పురోగతి

మేషం: స్త్రీలు గృహోపకరణాల పట్ల ఆసక్తి కనపరుస్తారు. నిరుద్యోగుల ఆలోచనలు ఉపాధి పథకాల దిశగా సాగుతాయి. ముఖ్యుల గురించి అప్రియమైన వార్తలు వినవలసివస్తుంది. ప్రింటింగ్ రంగాల్లో వారికి ఒత్తిడి, ఇతరత్రా చికాకులు వంటివి తప్పవు. విద్యార్థులకు చదువుల పట్ల ఏకాగ్రత చాలా అవసరం.
 
వృషభం: వృత్తి, ఉద్యోగాల్లో కొంత పురోగతి ఉంటుంది. కళ, క్రీడా రంగాల వారికి ప్రోత్సాహకరం. బ్యాంకింగ్ రంగాల వారికి ఒత్తిడి, చికాకులు అధికం. పాత్రికేయులకు ఒత్తిడి, పనిభారం అధికమవుతుంది. మీ కుటుంబీకుల్లో వచ్చిన మార్పు సంతోషం కలిగిస్తుంది. విద్యార్థుల్లో నూతనోత్సాహం చోటు చేసుకుంటుంది.  
 
మిధునం: వాతావరణంలో మార్పుతో స్వల్ప అస్వస్థతకు గురవుతారు. స్త్రీల పేరిట స్థిరచరాస్తుల కొనుగోళ్లకు అనుకూలం. ప్రైవేటు సంస్థలలోని వారికి మార్పలు అనుకూలిస్తాయి. కోర్టు వ్యవహారాల్లో ప్లీడర్లు, ప్లీడరు గుమస్తాలకు చికాకులు తప్పవు. వృత్తులు, ఏజెంట్లు, బ్రోకర్లకు శ్రమించిన కొలదీ ఆదాయం.  
 
కర్కాటకం: నూతన వ్యాపారాల అభివృద్ధికి కొత్త కొత్త పథకాలు, ప్రణాళికలు రూపొందిస్తారు. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలు నిరుత్సాహం కలిగిస్తాయి. ఖర్చులు అధికం, ధనవ్యయంలో తగు జాగ్రత్తలు అవసరం. వాహనం నడుపునపుడు జాగ్రత్త అవసరం. ఉద్యోగ, వృత్తి రీత్యా ప్రయాణం చేయవలసి వస్తుంది.   
 
సింహం: బంధువుల మధ్య స్పర్ధలు తొలగి వారికి మరింత చేరువవుతారు. కొత్త వ్యక్తులతో పరిచయాలు పెంచుకుంటారు. అసాధ్యమనుకున్న పనులు సనాయాసంగా పూర్తిచేస్తారు. ఇచ్చిపుచ్చుకునే వ్యవహారాలు, వాణిజ్య ఒప్పందాల్లో ఏకాగ్రత వహించండి. వస్త్ర, ఫ్యాన్సీ, బేకరీ వ్యాపారులకు పురోభివృద్ధి కానవస్తుంది.  
 
కన్య: పెద్దల ఆహార, ఆరోగ్య విషయాల్లో తగు జాగ్రత్తలు పాటించవలసి ఉంటుంది. ఒక స్థిరాస్తి అమర్చుకునే విధంగా మీ ఆలోచనలుంటాయి. ఏ విషయంలోను ఒంటెత్తు పోకడ మంచిది కాదని గమనించండి. దంపతుల మధ్య అన్యోన్యత చోటు చేసుకుంటుంది. స్త్రీలకు సంపాదన పట్ల ఆసక్తి ఏర్పడుతుంది.   
 
తుల: ఆర్థిక, కుటుంబ సమస్యలు మెరుగుపడుతాయి. వ్యాపారాల్లో కష్టనష్టాలను కొంతమేరకు అధికగమిస్తారు. స్టేషనరీ, ప్రింటింగ్ రంగాల వారికి ఒత్తిడి, పనిభారం అధికమవుతుంది. మీ అభిప్రాయాలకు మంచి స్పందన లభిస్తుంది. స్త్రీలకు బంధువుల ఆదరణ, చుట్టుపక్కల వారిలో మంచి గుర్తింపు, రాణింపు లభిస్తుంది.  
 
వృశ్చికం: ఉద్యోగస్తులకు ఒత్తిడి, పనిభారం వంటి సమస్యలు తలెత్తుతాయి. మీ సంతానం కోసం ధనం విరివిగా వ్యయం చేయవలసి ఉంటుంది. నూతన కాంట్రాక్టులు, లీజు, ఏజెన్సీలు, టెండర్లకు అనుకూలం. బంధువుల ఆసక్మిక రాక ఆశ్చర్యం కలిగిస్తుంది. ఎంతో కొంత పొదుపు చేయాలన్న మీ యత్నం ఫలించకపోవచ్చు.  
 
ధనస్సు: వ్యాపారాల అభివృద్ధికి మరింతగా శ్రమించవలసి ఉంటుంది. ఆదాయం కంటే ఖర్చులు అధికం. దూరప్రయాణాలు, పుణ్యక్షేత్ర సందర్శనలకు అనుకూలం. స్త్రీలకు పరిచయాలు వ్యాపాకాలు అధికం. నిరుద్యోగులు, వృత్తుల వారికి అన్ని విధాల కలిసిరాగలదు. ఆపద సమయంలో మిత్రులు అండగా నిలుస్తారు.  
 
మకరం: ఉద్యోస్తులకు కొత్త అధికారులతో సత్సంబంధాలు నెలకొంటాయి. స్త్రీలకు ఆసక్మిక ధనప్రాప్తి, వస్త్ర లాభం, వస్తులాభం వంటి శుభ ఫలితాలున్నాయి. కొన్ని వ్యవహారాలు అను కూలించినా మరికొన్ని ఆందోళన కలిగిస్తాయి. గృహంలో మార్పులు, చేర్పు అనుకూలం. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలలో జయం.     
 
కుంభం: వృత్తి వ్యాపారాల్లో గణనీయమైన పురోభివృద్ధి సాధిస్తారు. కళా, క్రీడా, సాంస్కృతిక రంగాల వారికి ఆదరణ లభిస్తుంది. విద్యార్థులు, ఉపాధ్యాయులకు ప్రశంసలు లభిస్తాయి. ఒక వ్యవహారం నిమిత్తం ప్లీడర్లతో సంప్రదింపులు జరుపుతారు. ఏ విషయంలోను ఇతరులపై ఆధారపడడం మంచిది కాదు.    
 
మీనం: రుణ విముక్తులు కావడంతో పాటు తాకట్టు వస్తువులు విడిపించుకుంటారు. బంధువులు, సోదరులతో సత్సంబంధాలు నెలకొంటాయి. అవగాహన లేని విషయాలకు దూరంగా ఉండడం మంచిది. గతంలో వాయిదా పడిన పనులు పూర్తిచేస్తారు. స్త్రీల పేరిట పొదుపు పథకాలు లాభిస్తాయి. విదేశాలు వెళ్లే ప్రయత్నాలు ఫలిస్తాయి.