శుక్రవారం, 10 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By రామన్
Last Updated : శనివారం, 8 డిశెంబరు 2018 (09:35 IST)

08-12-2018 - శనివారం మీ రాశిఫలితాలు - ఎప్పటినుండో వాయిదా పడిన పనులు...

మేషం: ట్రాన్స్‌పోర్ట్, ఆటోమోబైల్, మెకానికల్ రంగాల వారికి సామాన్యం. ఏదైనా స్థిరాస్తి విక్రయించాలనే ఆలోచన విరమించుకుంటారు. ఆలయాలను సందర్శిస్తారు. పత్రికా, ప్రైవేటు సంస్థలలోని వారికి ఒత్తిడి, పనిభారం అధికమవుతాయి. ఇతరులకు పెద్ద మెుత్తాలలో ధనసహాయం చేసే విషయంలో లౌకికం ఎంతో అవసరం.
 
వృషభం: ఉద్యోగస్తులకు బదిలీలు, నూతన బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది. అవివాహిత యువకులకు అందిన ఒక సమాచారం ఆందోళన కలిగిస్తుంది. చిట్స్, ఫైనాన్స్, బ్యాంకింగ్ రంగాల వారికి చికాకులు అధికమవుతాయి. రాజకీయ నాయకులు పార్టీలలో హుందాగా వ్యవహరించి అందరినీ ఆకట్టుకుంటారు.  
 
మిధునం: ఆర్థిక విషయాల్లో ముందుచూపు అవసరమని గమనించండి. విద్యార్ధుల మెుండితనం అనార్ధాలకు దారితీస్తుంది. స్త్రీలకు తల, కాళ్లు, నరాలకు సంబంధించిన చికాకులు అధికమవుతాయి. ఉద్యోగస్తులకు పనిభారం అధికమవుతుంది. గృహంలో ఒక శుభకార్యం చేయాలనే ఆలోచన వాయిదాపడుతుంది.  
 
కర్కాటకం: మార్కెట్, ప్రింటింగ్ రంగాల వారికి చికాకులు తప్పవు. హోటల్ తినుబండ, క్యాటరింగ్ రంగాల్లో వారికి కలిసి వచ్చేకాలం. సన్నిహితుల సలహాలు, హితోక్కులు మీపై మంచి ప్రభావం చూపుతాయి. భూమికి సంబంధించిన చికాకులు పరిష్కారమవుతాయి. సన్నిహితులు ఒక వ్యవహారంలో మిమ్ములను ఒత్తిడికి గురిచేస్తారు.   
 
సింహం: బ్యాంకు వ్యవహారాలలో అపరిచిత వ్యక్తులపట్ల జాగ్రత్త చాలా అవసరం. స్టేషనరీ, ప్రింటింగ్ రంగాలలో పనివారికి సదవకాశాలు లభిస్తాయి. నిర్మాణ పనులలో కాంట్రాక్టర్లకు ఏకాగ్రత లోపం వలన చికాకులు తప్పవు. వ్యవసాయ, తోటల రంగాల్లో వారికి వాతావరణంలో మార్పు ఆందోళన వంటివి కలిగిస్తుంది.  
 
కన్య: ఎప్పటినుండో వాయిదా పడిన పనులు పునఃప్రారంభమవుతాయి. తలపెట్టిన పనుల్లో ఆటంకాలు, ఒత్తిడి వంటి చికాకులు ఎదుర్కుంటారు. ఉపాధ్యాయులకు పనిభారం అధికం. గృహంలో మార్పులు, చేర్పులు అనుకున్నంత సంతృప్తి నివ్వవు. ఇప్పటి వరకూ అనుభవిస్తున్న ఇబ్బందులు, చికాకులు తొలగిపోగలవు.  
 
తుల: ఆర్థిక, కుటుంబ సమస్యలు ఒక కొలిక్కి వస్తాయి. విద్యార్థులు కొత్త వ్యక్తులతో ఆచితూచి వ్యవహరించాలి. కోర్టు వ్యవహారాలు వాయిదాపడుతాయి. మీ ఆంతరంగిక, కుటుంబ సమస్యలు గోప్యంగా ఉంచండి. విజ్ఞతాయుతంగా వ్యవహరించి మీ గౌరవాన్ని కాపాడుకోండి. ఆకస్మికంగా బిల్లులు చెల్లిస్తారు.  
 
వృశ్చికం: పత్రికా, ప్రైవేటు సంస్థలలోని వారికి మార్పులు అనుకూలించవు. దూరప్రయాణాల్లో అపరిచిత వ్యక్తుల పట్ల మెళకువ వహించండి. ఆలయ సందర్శనాలలో ఇబ్బందులు తప్పవు. రుణ విముక్తులు కావడంతో పాటు తాకట్టు వస్తువులు విడిపించుకుంటారు. కొంతమంది మీ మీద నిందారోపణ చేయడం వలన ఆందోళన అధికమవుతుంది.  
 
ధనస్సు: గృహోపకరణాలు సమకూర్చుకుంటారు. ప్రముఖులను కలుసుకుంటారు. ఉద్యోగులకు మంచి గుర్తింపు, గౌరవం లభిస్తుంది. పట్టింపుల వలన స్త్రీలు విలువైన అవకాశాలు కోల్పోయే ఆస్కారం ఉంది. కాంట్రాక్టర్లకు, ఇంజనీరింగ్ రంగాల్లో వారికి పురోభివృద్ధి. కోర్టు వ్యవహారాలు ఒక కొలిక్కి వచ్చే అవకాశాలున్నాయి.  
మకరం: ఉద్యోగస్తులు పై అధికారుల నుండి ఒత్తిడి, చికాకులు ఎదుర్కుంటారు. ఓర్పు, పట్టుదలతో శ్రమించి మీరు అనుకున్నది సాధిస్తారు. స్త్రీలు పనివారలతో ఎదుర్కుంటారు. ప్రయాణాలు ఇబ్బందులు కలిగిస్తాయి. నిరుద్యోగులు రాత, మౌఖిక పరీక్షల్లో ఏకాగ్రత వహించిన సత్ఫలితాలు లభిస్తాయి.       
 
కుంభం: ఆస్తి వ్యవహారాల్లో పెద్దల తీరు నిరుత్సాహం కలిగిస్తుంది. మీ మిత్రుల కోసం, బంధువుల కోసం బరువు భాద్యతలు స్వీకరిస్తారు. స్త్రీలకు నూతన పరిచయాలు, చుట్టుపక్కల వారి నుండి ఆహ్వానాలు అందుతాయి. హామీలకు దూరంగా ఉండడం శ్రేయస్కరం. ఊహించని ఖర్చుల వలన చేబదుళ్ళు వంటివి తప్పవు.    
 
మీనం: ప్రతి విషయంలోను స్వయం శక్తిని నమ్ముకోవడం మంచిది. పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. బ్యాంకుల్లో మీ పనులకు స్వల్ప ఆటంకాలను ఎదుర్కుంటారు. విజ్ఞతతో వ్యవహరించి రుణదాతలను సమాధానపరుస్తారు. ట్రాన్స్‌పోర్ట్, ఆటోమోబైల్, మెకానికల్ రంగాల వారికి పురోభివృద్ధి. ప్రముఖుల కలయిక సాధ్యం కాదు.