శనివారం, 25 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By రామన్
Last Updated : గురువారం, 6 డిశెంబరు 2018 (08:48 IST)

06-12-2018 గురువారం దినఫలాలు - బంధుమిత్రుల మధ్య సత్సంబంధాలు...

మేషం: రవాణా, ఎక్స్‌పోర్ట్ రంగాల్లో వారు పనివారి వలన ఇబ్బందులకు గురవుతారు. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. బంధువుల రాకతో ఊహించని ఖర్చులు అధికమవుతాయి. మీ సంతానం మెుండివైఖరి మీకు ఎంతో చికాకు కలిగిస్తుంది. ఉద్యోగస్తులకు పై అధికారుల నుండి ఒత్తిడి, చికాకులు అధికం. 
 
వృషభం: ఆర్థికంగా బాగుగా స్థిరపడుతారు. వాహనం ఇతరులకు ఇచ్చే విషయంలో లౌక్యంగా వ్యవహరించండి. రాజకీయ నాయకులు సభా సమావేశాలలో పాల్గొంటారు. మిత్రులను కలుసుకుంటారు. కొబ్బరి, పండ్లు, పూల, చిరు వ్యాపారులకు లాభదాయకంగా ఉంటుంది. ఉపాధ్యాయులకు పనిభారం అధికమవుతుంది.  
 
మిధునం: ఆలయ సందర్శనాలలో ఇబ్బందులను ఎదుర్కుంటారు. బ్యాంకు వ్యవహారాలలో ఒత్తిడి, చికాకులు తప్పవు. ట్రాన్స్‌పోర్ట్, ఆటోమోబైల్, మెకానికల్ రంగాల్లో వారికి పురోభివృద్ధి కానవస్తుంది. గత విషయాల గురించి ఆలోచిస్తూ కాలం వ్యర్థం చేయకండి. మీ కళత్రమెుండి వైఖరి మీకెంతో చికాకు కలిగిస్తుంది.  
 
కర్కాటకం: ఆర్థిక ఇబ్బంది లేకపోయినా సంతృప్తి కానరాదు. బంధువుల రాకతో గృహంలో సందడి నెలకొంటుంది. స్త్రీలకు ప్రయాణాలలో నూతన పరిచయాలేర్పడుతారయి. కలప, ఇటుక, ఇసుక వ్యాపారస్తులకు పురోభివృద్ధి. కుటుంబీకులతో కలిసి ఆలయాలను సందర్శిస్తారు. విద్యార్థుల అత్యుత్సాహం అనార్ధాలకు దారితీస్తుంది.   
 
సింహం: కోళ్ళ, మత్స్య, గొర్రెల వ్యాపారస్తులకు ఏకాగ్రత అవసరం. బంధుమిత్రుల మధ్య సత్సంబంధాలు నెలకొంటాయి. కోర్టు వ్యవహారాలు కొత్త మలుపు తిరుగుతాయి. నూతన వ్యాపారాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. ప్రింటింగ్, స్టేషనరీ రంగాలలోని వారికి కలిసివచ్చేకాలం. ఇచ్చిపుచ్చుకునే వ్యవహారాల్లో మెళకువ వహించండి.  
 
కన్య: ఆర్థిక ఒడిదుడుకులు ఎదుర్కొన్న నెమ్మదిగా సమసిపోతాయి. స్త్రీలకు పనివారితో చికాకులు అధికం. మీ విలువైన వస్తువులు ఇతరులకిచ్చి ఇబ్బందులకు గురికాకండి. ఎలక్ట్రికల్, ఎలక్ట్రానికల్, కంప్యూటర్ రంగాల్లో వారికి పురోభివృద్ధి కానవస్తుంది. ముఖ్యుల కోసం, మీ ప్రియతముల కోసం ధనం బాగా వెచ్చిస్తారు.   
 
తుల: ఉపవాసాలు, విశ్రాంతి లోపం వలన స్త్రీల ఆరోగ్యం మందగిస్తుంది. రియల్‌ఎస్టేట్ రంగాల వారికి నూత టెండర్ల విషయంలో పునరాలోచన అవసరం. వైద్యులకు శస్త్రచికిత్సలలో ఏకాగ్రత అవసరం. వ్యాపారులకు, తయారీదారులకు ఒత్తిడి పెరుగుతుంది. విద్యార్థులు వాహనం నడుపునపుడు జాగ్రత్త అవసరం.  
 
వృశ్చికం: విద్యార్థులు మెుండివైఖరి అవలంబించుట వలన మాటపడక తప్పదు. కుటుంబీకుల మధ్య విషయంలో తగు జాగ్రత్తలు అవసరం. రాజకీయ నాయకులకు గుర్తింపు, రాణింపు లభిస్తుంది. భాగస్వామిక సమావేశంలో కొత్త విషయాలు చర్చకు వస్తాయి. మీ కోపతాపాలు అదుపులో ఉంచుకోవడం మంచిది.  
 
ధనస్సు: వ్యాపారాభివృద్ధికై చేయు ప్రయత్నాలలో సఫలీకృతులవుతారు. స్పెక్యులేషన్, రియల్‌ఎస్టేట్ ఏజెంట్లకు, బ్రోకర్లకు పురోభివృద్ధి. ప్రేమికుల మధ్య విభేదాలు తలెత్తుతాయి. నిరుద్యోగులకు ఇంటర్వ్యూల సమాచారం అందుతుంది. దూరప్రయాణాలలో కొత్త వ్యక్తులతో పరిచయాలు, వ్యాపకాలు అధికమవుతాయి.  
 
మకరం: వస్త్ర, వ్యాపారులు పనివారలను ఓ కంట కనిపెట్టుకని ఉండడం శ్రేయస్కరం. ఒప్పందాలు, హామీలకు సంబంధించిన విషయాల్లో పునరాలోచన అవసరం. స్త్రీల తెలివి తేటలకు, వాక్‌చాతుర్యానికి గుర్తింపు లభిస్తుంది. దైవ సేవా కార్యక్రమాల్లో ఇబ్బందులను ఎదుర్కుంటారు. వాహనం నడుపునపుడు మెళకువ అవసరం.     
 
కుంభం: రాని మెుండి బాకీలు సైనం వసూలు చేస్తారు. కుటుంబీకుల మధ్య కొత్త విషయాలు ప్రస్తావనకు వస్తాయి. మిమ్మల్ని చూసి అసూయపడేవారు అధికమవుతున్నారని గమనించండి. అనుకోకుండా వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారు. విదేశీయాన యత్నాల్లో ఆటంకాలు తొలగిపోగలవు.    
 
మీనం: పరిచయస్తులు ధనసహాయం అర్ధిస్తారు. ఎప్పటి సమస్యలు అప్పుడే పరిష్కరించుకోవడం ఉత్తమం. తొందరపాటు మాటలు, నిర్ణయాలు ఇబ్బందులకు దారితీస్తాయి. ఇంటా, బయటా మీ గౌరవ మర్యాదలకు భంగం కలుగుకుండా జాగ్రత్త వహించండి. నిరుద్యోగులు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడం మంచిది.