గురువారం, 9 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By రామన్
Last Updated : మంగళవారం, 4 డిశెంబరు 2018 (09:36 IST)

04-12-2018 మంగళవారం దినఫలాలు - ఆదాయ వ్యయాలు సంతృప్తికరంగా...

మేషం: ఉద్యోగస్తులు సమర్థంగా పనిచేసి పై అధికారుల ప్రాపకం సంపాదిస్తారు. స్త్రీలు గృహోపకరణాలకు కావలసిన వస్తువులను కొనుగోలు చేస్తారు. సోదరీసోదరుల మధ్య అవగాహన ఏర్పడుతుంది. మీ లక్ష్యసాధనకు ఓర్పు, పట్టుదల ముఖ్యం. అకాల భోజనం, విశ్రాంతి లోపం వలన ఆరోగ్యం మందగిస్తుంది. 
 
వృషభం: ఇచ్చిపుచ్చుకునే వ్యవహారాలు, వాణిజ్య ఒప్పందాల్లో ఏకాగ్రత అవసరం. రాజకీయ నాయకులకు ప్రయాణాలలో మెళకువ అవసరం. విద్యార్థులు ఇతరుల కారణంగా మాడపడవలసి వస్తుంది. విరోధులు వేసే పథకాలు త్రిప్పి గొట్టగలుగుతారు. స్థిరచరాస్తుల క్రయవిక్రయాలు అనుకూలిస్తాయి.  
 
మిధునం: వ్యాపార, ఆర్థిక రహస్యాలు గోప్యంగా ఉంచండి. పత్రికా సంస్థలలోని వారికి కీలకమైన వార్తల ప్రచురణలో పునరాలోచన మంచిది. మీ సంతానం పై చదువుల కోసం పొదుపు ప్రణాళికల పట్ల దృష్టి సారిస్తారు. బంధువులను కలుసుకుంటారు. స్త్రీలకు అలంకారాలు, విలాస వస్తువుల పట్ల మక్కువ పెరుగుతుంది.  
 
కర్కాటకం: ఆదాయ వ్యయాలు సంతృప్తికరంగా ఉంటాయి. సొంతంగా వ్యాపారం చేయాలనే ఆలోచన గురించి మీ శ్రీమతితో చర్చిస్తారు. ప్రింటింగ్ రంగాల వారికి పనిభారం బాగా పెరుగుతుంది. కష్టపడి పనిచేస్తే డబ్బు దానంతటదే వస్తుంది. తొందరపడి సంభాషించడం వలన ఇబ్బందులకు గురికాక తప్పదు.   
 
సింహం: ఆర్థిక విషయాల్లో సంతృప్తి కానరాదు. ఊహాగానాలతో కాలం వ్యర్ధం చేయక సత్‌కాలంను సద్వినియోగం చేసుకోండి. ఆలయాలను సందర్శిస్తారు. వాహనం ఇతరులకు ఇచ్చి ఇబ్బందులను ఎదుర్కుంటారు. అలౌకిక విషయాల పట్ల ఏకాగ్రత వహిస్తారు. కొంతమంది మీపై ఆధిపత్యం చెలాయించేందుకు యత్నిస్తారు.  
 
కన్య: స్థిరాస్తుల అమ్మకానికై చేయు యత్నాలు వాయిదాపడడం మంచిది. బ్యాంకు వ్యవహారాలలో మెళకువ అవసరం. హోటల్, తినుబండ, క్యాటరింగ్ రంగాలలో వారికి పురోభివృద్ధి కానవస్తుంది. ఇతరులకు ధనం ఇవ్వడం వలన ఇబ్బందులను ఎదుర్కుంటారు. ఉద్యోగస్తులకు అధికారిక పర్యటనలు, బాధ్యతలు అధికం.   
 
తుల: ఆర్థిక విషయాల పట్ల అవగాహన పెంచుకుంటారు. గృహంలో మార్పులు, చేర్పులు అనుకున్నంత సంతృప్తి నివ్వవు. ప్రముఖులను కలుసుకుంటారు. శ్రీవారు, శ్రీమతి గౌరవ ప్రతిష్టలకు భంగం కలిగించే పరిణామాలు ఎదుర్కుంటారు. మీ అభిప్రాయాలను ఇతరులపై బలవంతంగా రుద్దడం మంచిది కాదని గమనించండి.  
 
వృశ్చికం: చేపట్టిన పనులు ఆలస్యంగానైనా పూర్తిచేస్తారు. పెద్దల ఆరోగ్యంలో మెళకువ అవసరం. ఆత్మయులను విమర్శించుట వలన చికాకులను ఎదుర్కుంటారు. సన్నిహితుల సలహాలు, హితోక్కులు మీపై మంచి ప్రభావం చూపుతాయి. నిరుద్యోగులు భవిష్యత్ గురించి పథకాలు చేసిన సత్ఫలితాలు పొందుతారు.  
 
ధనస్సు: డాక్టర్లు శస్త్రచికిత్సలు విజయవంతంగా పూర్తిచేస్తారు. మీరు ఓ స్నేహితునితో కలిసి మీ లక్ష్యాన్ని చేరుకోవడానికి కృషి చేస్తారు. రాజకీయనాయకులు సభలు, సమావేశాలలో హుందాగా వ్యవహరించి అందరినీ ఆకట్టుకుంటారు. కోర్టు వ్యవహారాల్లో ప్లీడర్లు, ప్లీడరు గుమస్తాలకు ఊహించిన చికాకులు ఎదురవుతాయి.  
 
మకరం: స్త్రీలకు స్వీయ ఆర్జన పట్ల ఆసక్తి, ప్రోత్సాహం లభిస్తుంది. నిర్మాణ కార్యక్రమాలలో ప్రోత్సాహం కానవస్తుంది. ఉద్యోగస్తులు సందర్భానుకూలంగా సంభాషించి సమస్యలకు దూరంగా ఉండండి. ప్రైవేటు సంస్థలలో వారికి సామాన్యంగా ఉంటుంది. నిరుద్యోగులు పోటి పరీక్షల్లో అనుకూల ఫలితాలు సాధిస్తారు.     
 
కుంభం: సభలు, సమావేశాలలో హుందాగా వ్యవహరించి అందరినీ ఆకట్టుకుంటారు. ఉద్యోగస్తులు వ్యాపార రీత్యా ప్రయాణాలు చేయవలసి ఉంటుంది. స్త్రీలు పనివారలతో ఒత్తిడి, చికాకులు ఎదుర్కుంటారు. ప్రతి పని చేతిదాకా వచ్చి వెనక్కి పోవుటవలన ఆందోళన పెరుగుతుంది. పరిచయస్తులు ధనసహాయం అర్ధిస్తారు.    
 
మీనం: ఉపాధ్యాయులకు మంచి గుర్తింపు, రాణింపు లభిస్తుంది. వృధా ఖర్చులు, అనుకోని చెల్లింపుల వలన ఆటుపోట్లును ఎదుర్కంటారు. ఇతరులను అతిగా విశ్వసించడం వలన నష్టపోయే ప్రమాదముంది జాగ్రత్త వహించండి. నూతన వ్యాపారాలు, అగ్రిమెంట్లకు సంబంధించిన విషయాల పట్ల శ్రద్ధ కనపరుస్తారు.