గురువారం, 23 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By
Last Updated : గురువారం, 29 నవంబరు 2018 (08:42 IST)

గురువారం (29-11-2018) దినఫలాలు - లౌక్యంగా వ్యవహరించడం వల్ల...

మేషం: విదేశీయానం కోసం చేసే యత్నాల్లో సఫలీకృతులవుతారు. చేపట్టిన పనులు సకాలంలో పూర్తిచేస్తారు. ముఖ్యమైన వ్యవహారాలలో ఆటంకాలు ఎదురైనా సన్నిహితుల సాయంతో పూర్తిచేస్తారు. దైవ, సేవ, పుణ్యకార్యాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. అకాలభోజనం, శ్రమాధిక్యత వలన స్త్రీల ఆరోగ్యం మందగిస్తుంది. 
 
వృషభం: ఆర్థిక లావాదేవీలు, కుటుంబ వ్యవహారాలు సమర్థంగా నిర్వహిస్తారు. స్థిరచరాస్తుల కొనుగోలు విషయమైన ప్రముఖులతో సంప్రదింపులు జరుపుతారు. ఎప్పటి నుండో వాయిదాపడుతూ వస్తున్న పనులు పునఃప్రారంభమవుతాయి. వ్యాపార వర్గాల వారి మాటతీరు, స్కీములు కొనుగోలు దార్లను ఆకట్టుకుంటాయి.  
 
మిధునం: స్త్రీలకు బ్యాంకింగ్ వ్యవహారాలలో అపరిచిత వ్యక్తుల పట్ల మెళకువ అవసరం. విధి నిర్వహణలో నిర్లక్ష్య ధోరణి వలన మాటపడక తప్పదు. నూనె, మిర్చి, కంది వ్యాపారస్తులకు, స్టాకిస్టులకు పురోభివృద్ధి. దైవ, పుణ్య కార్యాలలో ఇతోధికంగా వ్యవహరిస్తారు. శకునాల కారణంగా మీ ప్రయాణం వాయిదా వేసుకుంటారు. 
 
కర్కాటకం: విద్యార్థులకు స్థిరబుద్ధి అవసరమని గమనించండి. ఇతరులకు పెద్ద మెుత్తాలలో ధనసహాయం చేసే విషయంలో లౌకికం ఎంతో అవసరం. స్త్రీలకు కాళ్ళు, నడుము, నరాలకు సంబంధించిన చికాకులు అధికమవుతాయి. ఉద్యోగ యత్నాలు ఫలిస్తాయి. మితిమీరిన ఆలోచనలు మీ మనస్సును వ్యాకుల పరుస్తాయి.   
 
సింహం: ముఖ్యు నుండి ధన సహాయం లభించడంతో ఒకడుగు ముందుకు వేస్తారు. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలు అనుకూలిస్తాయి. రాజకీయ నాయకులు సభలు, సమావేశాల్లో పాల్గొంటారు. శస్త్రచికిత్త చేయునపుడు వైద్యులకు మెళకువ అవసరం. ప్రేమికులు క్షణికావేశంలో తీసుకున్న నిర్ణయం అనార్ధాలకు దారితీస్తుంది.  
 
కన్య: సాహస ప్రయత్నాలు విరమించండి. లౌక్యంగా వ్యవహరించడం వలన కొన్ని వ్యవహారాలు మీకు అనుకూలిస్తాయి. పొదుపు చేయాలన్న మీ యత్నం ఏ మాత్రం సాధ్యం కాదు. బ్యాంకు వ్యవహారాలలో సమస్యలు తలెత్తుతాయి. ఆహార, ఆరోగ్య విషయాల్లో తగు జాగ్రత్తలు అవసరం. వాహనం నడుపునపుడు జాగ్రత్త అవసరం.   
 
తుల: మీ ఔదార్యాన్ని కొంతమంది దుర్వినియోగం చేసే అవకాశం ఉంది. జాగ్రత్త వహించండి. ఉద్యోగస్తులకు పై అధికారుల నుండి ఒత్తిడి, చికాకులు అధికమవుతాయి. పాత రుణాలు తీరుస్తారు. మీ సంతానం మెుండివైఖరి చికాకు కలిగిస్తుంది. ఉద్యోగస్తుల దైనందిన కార్యక్రమాలు సజావుగా సాగుతాయి.  
 
వృశ్చికం: ఆర్థిక విషయాల్లో గోప్యంగా వ్యవహరించండి. విద్యార్థులకు తోటి వారి కారణంగా మాటపడక తప్పదు. మీ ఉన్నతిని చూచి అసూయపడేవారు అధికమవుతున్నారని గమనించండి. పుణ్యక్షేత్రాల దర్శనం వలన మానసిక ప్రశాంతత చేకూరుతుంది. ఉద్యోగస్తుల ఆలోచనలు పరి పరి విధాలుగా ఉండడం వలన మాటపడక తప్పదు.  
 
ధనస్సు: వన సమారాధనలు, వేడుకలకు ప్రణాళికలు రూపొందిస్తారు. బ్యాంకు వ్యవహారాలలో అపరిచిత వ్యక్తుల పట్ల మెళకువ అవసరం. శ్రీమతి సలహా పాటించడం చిన్నతనంగా భావించకండి. అప్పుడప్పుడు పెద్దల ఆరోగ్యంలో ఇబ్బందులు ఎదుర్కోక తప్పదు. ప్రేమికులకు పెద్దల నుండి, ఇతరత్రా చికాకులు ఎదుర్కోక తప్పదు.  
 
మకరం: ఆపద సమయంలో ఒకరిని ఆదుకోవడం వలన ఆదరణ, గుర్తింపు లభిస్తాయి. కుటుంబీకుల పట్ల ఆసక్తి కనుపరుస్తారు. కిరణా, ఫ్యాన్సీ సుగంధ ద్రవ్య వ్యాపారులకు కలిగిరాగలదు. ఉద్యోగస్తులు అధికారుల తీరును గమనించి మెలగవలసి ఉంటుంది. కొంతమంది మీ ఆలోచనలు నిరుగార్చేందుకు యత్నిస్తారు.     
 
కుంభం: ఆర్థికంగా పురోగమించడానికి చేసే యత్నాలు ఫలిస్తాయి. మీ బంధువులను సహాయం అర్ధించే బదులు మీరే ప్రత్యామ్నాయం చూసుకోవడం ఉత్తమం. ప్రింటింగ్ రంగాల వారికి బాకీలు వసూళ్ళల్లో శ్రమాధిక్యత, ప్రయాసలు తప్పదు. ధనం ఏ మాత్రం నిల్వ చేయలేకపోవడం వలన ఆందోళనకు గురవుతారు.   
 
మీనం: ప్రత్తి, పొగాకు, మిర్చి, నూనె వ్యాపారస్తులకు, స్టాకిస్టులకు పురోభివృద్ధి. స్త్రీలకు ఆత్మాభిమానం అధికం కావడం వలన ఎదుటివారంతో ఏకీభవించలేకపోతారు. ఉద్యోగస్తుల తొందరపాటు నిర్ణయాల వలన సమస్యలు ఎదుర్కుంటారు. వ్యవసాయ, తోటల రంగాల్లో వారిక సంతృప్తి కానరాదు. సంఘంలో మంచి గుర్తింపు లభిస్తుంది.