శుక్రవారం, 10 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By రామన్
Last Updated : బుధవారం, 28 నవంబరు 2018 (08:20 IST)

బుధవారం (28-11-2018) దినఫలాలు : విద్యార్థినుల మెుండితనం...

మేషం: బ్యాంకు పనులు ఆలస్యం కావడంతో నిరుత్సాహం చెందుతారు. విద్యార్థులు మానసిక ఒత్తిడికి గురవుతారు. సంఘంలో పలుకుబడి కలిగిన వ్యక్తులతో పరిచయాలేర్పడుతాయి. అకాల భోజనం, విశ్రాంతి లోపం వలన ఆరోగ్యం మందగిస్తుంది. ఖర్చులు ఊహించనవి కావడంతో ఇబ్బందులు పెద్దగా ఉండవు. 
 
వృషభం: ఉద్యోగస్తుల సమర్థత, పనితీరుకు మంచి గుర్తింపు లభిస్తుంది. మీ ఆవేశం, అవివేకం వలన వ్యవహారం చెడే ఆస్కారం ఉంది. స్త్రీలకు అనవసర ప్రసంగాలు అపార్ధాలకు దారితీస్తాయి మెళకువ వహించండి. ద్విచక్ర వాహనంపై దూరప్రయాణాలు మంచిది కాదని గమనించండి. ఆలయ సందర్శనాలకు అధిక సమయం వెచ్చిస్తారు.  
 
మిధునం: విద్యార్థినుల మెుండితనం అనార్ధాలకు దారితీస్తుంది. భాగస్వామికులు మిమ్ములను తప్పుదారి పట్టించేందుకు యత్నిస్తారు. స్త్రీలు ఒకే కాలంలో అనేక పనులు చేపట్టుట వలన దేనిలోను ఏకాగ్రత వహించలేరు. ఇతరుల గురించి సరదాగా చేసిన వ్యాఖ్యాలు వివాదాస్పదమవుతాయి. కుటుంబ సమస్యలు మెరుగుపడుతాయి.  
 
కర్కాటకం: స్థిరచరాస్తుల క్రయవిక్రయాలకు సంబంధించి ప్రముఖులతో సంప్రదింపులు జరుపుతారు. మార్కెట్ రంగాల వారికి నిరుద్యోగులకు సదవకాశాలు లభిస్తాయి. స్త్రీలు షాపింగ్‌ల కోసం ధనం అధికంగా వ్యయం చేస్తారు. విద్యార్థులకు చురుకుదనం లోపించడంతో పాటు ఇతర వ్యాపకాల పట్ల ఆసక్తి పెరుగుతుంది.   
 
సింహం: దైవ దర్శనాలు చేసుకుంటారు. పెద్దల సలహాను పాటించి మీ గౌరవాన్ని నిలబెట్టుకుంటారు. పత్రికా, వార్తా సంస్థలలోని వారికి పరీక్షా సమయం. తలపెట్టిన పనులలో జాప్యం వలన నిరుత్సాహం తప్పదు. ముఖ్యుల కోసం ధనం బాగుగా వెచ్చించవలసి ఉంటుంది. దైవ, సేవా కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటారు. 
 
కన్య: పోస్టల్, టెలిగ్రాఫ్ రంగాలలో వారికి అనుకూలం. పాత రుణాలు తీర్చడంతో పాటు విలువైన పరికరాలు అమర్చుకుంటారు. నూతన పరిచయాలేర్పడుతాయి. దంపతుల మధ్య చిన్న చిన్న అభిప్రాయబేధాలు తలెత్తుతాయి. రాజకీయనాయకులు సభలు, సమావేశాలలో హుందాగా వ్యవహరించి అందరినీ ఆకట్టుకుంటారు.   
 
తుల: స్టేషనరీ, ప్రింటింగ్ రంగాల వారికి పురోభివృద్ధి కానవస్తుంది. ఖర్చులు అధికమవుతాయి. స్త్రీలు చుట్టుపక్కలవారితో, పనివారలతో లౌక్యంగా వ్యవహరించవలసి ఉంటుంది. మీ సంతానం విద్య, వివాహ విషయాల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహిస్తారు. మిత్రుల సహకారంతో ఓ సమస్యను సునాయాసంగా పరిష్కరిస్తారు.  
 
వృశ్చికం: ప్రైవేటు చిట్స్, ఫైనాన్స్ వ్యాపారులకు ఖాతాదారులతో సమస్యలెదురవుతాయి. ఉద్యోగులు పై అధికారుల నుండి ఒత్తిడి, మెుహ్మమాటాలు ఎదుర్కోవలసి వస్తుంది. శ్రీవారు, శ్రీమతికి అవసరమైన వస్తువులు సేకరిస్తారు. కష్ట సమయంలో మిత్రులు అండగా నిలుస్తారు. స్త్రీలకు బంధువులతో సఖ్యత నెలకొంటుంది.  
 
ధనస్సు: ఉద్యోగస్తులు ఒత్తిళ్ళు, ప్రలోభాలకు దూరంగా ఉండడం మంచిది. హోటల్, తినుబండారాలు, క్యాటరింగ్ పనివారలకు పురోభివృద్ధి. గృహోపరకణాలకు కావలసిన వస్తువులను కొనుగోలు చేస్తారు. మీ పాత సమస్యలు పరిష్కారం కావపోవడంతో ఒకింత నిరుత్సాహానికి గురవుతారు. ఆకస్మికంగా బిల్లులు చెల్లిస్తారు. 
 
మకరం: వస్త్ర, బంగారం, వెండి వ్యాపారులకు పనివారలతో చికాకులు తలెత్తుతాయి. ఆపద సమయంలో సన్నిహితులు అండగా నిలుస్తారు. పెంపుడు జంతువుల గురించి ఆందోళన చెందుతారు. ప్రయాణాలలో వస్తువులు పోయే ఆస్కారం ఉంది. జాగ్రత్త వహించండి. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలలో మెళకువ అవసరం.     
 
కుంభం: బ్యాంకు వ్యవహారాలు చురుకుగా సాగుతాయి. ఇచ్చిపుచ్చుకునే వ్యవహారాలలో మెళకువ అవసరం. చేపట్టిన పనులలో అవాంతరాలు ఎదురైనా ఆత్మ ధైర్యంతో అడుగు ముందుకేయండి. ద్విచక్రవాహనం పై దూరప్రయాణం మంచిది కాదని గమనించండి. దంపతుల మధ్య అవగాహన లోపం వంటివి ఎదుర్కుంటారు.   
 
మీనం: ట్రాన్స్‌పోర్టు, ఆటోమొబైల్, మెకానికల్ రంగాల వారికి సామాన్యం. బంధువుల రాకతో గృహంలో అసౌకర్యానికి గురవుతారు. ఉపాధ్యాయులకు ఒత్తిడి, చికాకులు తప్పవు. గృహ నిర్మాణాలు, మరమ్మత్తులు మందకొడిగా సాగుతాయి. దైవ, సేవా, పుణ్య కార్యాలకు సహాయ సహకారాలు అందిస్తారు.