శనివారం, 4 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By రామన్
Last Updated : సోమవారం, 26 నవంబరు 2018 (08:24 IST)

26-11-2018 సోమవారం దినఫలాలు - ఓర్పు, పట్టుదలతో శ్రమించి...

మేషం: గృహ నిర్మాణాలకు కావలసిన ప్లాను ఆమోదం పొందుతుంది. విందుల్లో పరిమితి అవసరం. బంధువుల రాకతో ఖర్చులు అధికమవుతాయి. చేస్తున్న ఉద్యోగాలు తొందరపడి మానవద్దు. కోర్టు తీర్పులు వాయిదా పడుతాయి. ప్రింటింగ్ రంగాల వారికి సమర్థులైన పనివారలు దొరకటం కష్టం. మెుక్కుబడులు తీర్చుకుంటారు. 
 
వృషభం: వస్త్ర, బంగారం వ్యాపారులకు పనివారలతో చికాకులు తప్పవు. గత విషయాలు జ్ఞప్తికి రాగలవు. దంపతుల మధ్య అభిప్రాయ భేదాలు, చీటికి మాటికి కలహాలు వంటి చికాకులు తలెత్తుతాయి. లీజు, ఏజెన్సీలు, నూతన టెండర్ల వ్యవహారాల్లో పునరాలోచన అవసరం. విదేశీయానం, రుణ యత్నాలు ఫలిస్తాయి.  
 
మిధునం: మీ శ్రీమతి ప్రోత్సాహంతో ఒక శుభకార్యానికి యత్నాలు మెుదలెడతారు. ఒక స్థిరాస్తి అమర్చుకోవాలనే ఆలోచన స్పురిస్తుంది. కంప్యూటర్ రంగాల వారికి చికాకులు తప్పవు. ఓర్పు, పట్టుదలతో శ్రమించి అనుకున్నది సాధిస్తారు. సంఘంలో పలుకుబడి కలిగిన వ్యక్తులతో పరిచయాలు పెంచుకుంటారు.  
 
కర్కాటకం: ప్రింటింగ్ రంగాల వారికి సదవకాశాలు లభిస్తాయి. డాక్టర్లు శస్త్రచికిత్సలు విజయవంతంగా పూర్తిచేస్తారు. వ్యాపారాల అభివృద్ధికి మరింతగా శ్రమించవలసి ఉంటుంది. ప్రముఖుల కలయిక ప్రయోజనకరంగా ఉంటుంది. సంఘంలో గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి. వాహనం ఇతరులకు ఇచ్చి ఇబ్బందులను ఎదుర్కుంటారు.   
 
సింహం: ఆర్ధికంగా మంచి ప్రోత్సాహం లభిస్తుంది. ఉద్యోగస్తులకు స్థాన, స్థల మార్పిడులు ఉంటాయి. ఆదాయ వ్యయాలు తగినట్లుగా ఉంటాయి. సోదరీ, సోదరులతో తొందరపాటు నిర్ణయాల వలన ఇబ్బందులను ఎదుర్కుంటారు. ప్రయాణాలలో మెళకువ అవసరం. పాత రుణాలు తీరుస్తారు. విద్యార్థుల సహనానికి పరీక్షా సమయం.  
 
కన్య: ఉపాధ్యాయులకు చికాకులు తప్పదు. ప్రముఖుల కలయిక వలన మీ సమస్యలు పరిష్కార మార్గంలో నడుస్తాయి. పత్రికా సంస్థలలోని వారు ఎంత జాగ్రత్తగా వ్యవహరించినా పొరపాట్లు జరుగకమానవు. మీ జీవితభాగస్వామి పట్ల ఓర్పుతో వ్యవహరించండి. గృహ ప్రశాంతతకు భంగం కలిగే సూచనలున్నాయి.   
 
తుల: చేపట్టిన పనులు అర్థాంతంగా ముగించవలసి ఉంటుంది. ఆస్తి వంపకాల విషయంపై సోదరుల పోరు అధికమవుతుంది. ఇంటా బయటా ప్రతికూల పరిస్థితులు ఎదుర్కుంటారు. ఆకస్మిక ఖర్చులు, చెల్లింపుల వలన స్వల్ప ఆటుపోట్లను ఎదుర్కుంటారు. నిరుద్యోగులకు ఇంటర్వ్యూల్లో మెళకువ, ఏకాగ్రత చాలా అవసరం. 
 
వృశ్చికం: ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. స్త్రీలు కొన్ని విషయాలను పట్టించుకోకపోవడం శ్రేయస్కరం. ప్రముఖులను కలుసుకుంటారు. వాయిదా పడిన పనులు ఎట్టకేలకు పూర్తికాగలవు. రియల్ ఎస్టేట్ రంగాల వారికి ఆశించినంత పురోభివృద్ధి ఉండదు. కోర్టు వ్యవహారాలలో ప్లీడర్లకు ఒత్తిటి, చికాకులు అధికమవుతాయి.  
 
ధనస్సు: ఆర్థిక ఇబ్బందులు తొలగి మానసికంగా కుదుటపడుతారు. ఏ విషయంలోను ఇతరులపై ఆధారపడడం మంచిది కాదు. స్త్రీలకు ఒక స్థిరాస్తి అమర్చుకోవాలనే ఆలోచన బలపడుతుంది. దుబారా ఖర్చులు తగ్గించాలన్న మీ ఆలోచన ఫలిస్తుంది. దూర ప్రయాణాలలో వస్తువుల పట్ల మెళకువ అవసరం. 
 
మకరం: సన్నిహితుల వాఖ్యాలు మీపై మంచి ప్రభావం చూపుతాయి. రావలసిన ధనం అందటంతో ఆర్థికంగా కుదుటపడుతారు. బంధువుల ఆకస్మిక రాక ఇబ్బంది కలిగిస్తుంది. పత్రికా, ప్రైవేటు సంస్థలలోని వారికి యాజమాన్యం తీరు నిరుత్సాహం కలిగిస్తుంది. పెద్దల ఆరోగ్యంలో మార్పు సంతృప్తినిస్తుంది.     
 
కుంభం: ఉమ్మడి వ్యవహారాలు, ఆర్థిక లావాదేవీల్లో సముచిత నిర్ణయాలు తీసుకుంటారు. సోదరీసోదురుతో సంబంధ బాంధవ్యాలు బలపడుతాయి. వాహనం ఏకాగ్రతతో నడపవలసి ఉంటుంది. స్త్రీలకు పరిచయాలు వ్యాపకాలు అధికమవుతాయి. విద్యార్థినులకు సహచరుల తీరు ఆందోళన కలిగిస్తుంది. 
 
మీనం: వృత్తి వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. స్త్రీలకు నరాలు, దంతాలు, ఎముకలకు సంబంధించిన చికాకులు అధికమవుతాయి. నిరుద్యోగులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడం మంచిది. కాంట్రాక్టు విషయంలో పునరాలోచన అవసరం. ఇతరులకు సహాయం అర్థించి భంగపాటుకు గురవుతారు.