సోమవారం, 6 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By
Last Updated : ఆదివారం, 25 నవంబరు 2018 (09:17 IST)

25-11-2018-ఆదివారం మీ రాశి ఫలితాలు.. ఒకే కాలంలో అనేక పనులు వద్దు..

మేషం: ప్రముఖుల ఇంటర్వ్యూ కోసం అధిక సమయం వేచి ఉండాల్సి వస్తుంది. స్త్రీలకు అనవసర ప్రసంగాలు అపార్ధాలకు దారితీస్తాయి. మత్స్య, కోళ్ళ వ్యాపారస్తులకు లాభదాయకం. దైవ సేవా కార్యక్రమాల్లో ఇబ్బందులను ఎదుర్కుంటారు. ఇతరులకు పెద్ద మెుత్తంలో ధనసహాయం చేసే విషయంలో లౌక్యం ఎంతో అవసరం. 
 
వృషభం: వన సమారాధనలు, వేడుకలకు ప్రణాళికలు రూపొందిస్తారు. ఒకే కాలంలో అనేక పనులు చేపట్టడం వలన దేనిలోను ఏకాగ్రత వహించలేరు. వాహనం ఇచ్చే విషయంలో లౌక్యంగా వ్యవహరిస్తారు. ఖర్చుల విషయంలో ఏకాగ్రత వహించండి. స్త్రీలు శుభకార్యాలలో కలుపుగోలుగా వ్యవహరించి అందరినీ ఆకట్టుకుంటారు.  
 
మిధునం: వ్యాపారా, ఆర్థికాభివృద్ధికి చేయు కృషిలో ఆశాజనకమైన మార్పులుంటాయి. మీ ఆవేశం, అవివేకం వలన వ్యవహారం చెడే ఆస్కారం ఉంది. సన్నిహితుల సలహాలు, హితోక్తులు మీపై మంచి ప్రభావం చూపుతాయి. నిరుద్యోగులకు ఇంటర్వ్యూల సమాచారం అందుతుంది. కుటుంబీకులతో కలిసి మనసమారాధనలో పాల్గొంటారు. 
 
కర్కాటకం: ఆదాయ వ్యయాల్లో ప్రణాళికాబద్ధంగా వ్యవహరిస్తారు. కాంట్రాక్టర్లకు నూతన టెండర్లు అతి కష్టంమ్మీద అనుకూలిస్తాయి. స్త్రీలకు పరిచాయలు, వ్యాపకాలు అధికమవుతాయి. బంధుమిత్రుల నుండి కావలసిన సమాచారం రాబట్టుకుంటారు. స్త్రీలకు ఏ విషయంలోను మనస్థిమితం అంతగా ఉండదు.   
 
సింహం: ఆర్థిక లావాదేవీలు, నూతన వ్యాపారాలు సమర్థంగా నిర్వహిస్తారు. స్టాక్ మార్కెట్ రంగాల వారి అంచనాలు ఫలిస్తాయి. మీ వాహనం ఇతరులకిచ్చి ఇబ్బందులెదుర్కుంటారు. మీ శ్రీమతి ప్రోత్సాహంతో ఒక శుభకార్యానికి యత్నాలు మెుదలెడతారు. ముఖ్యమైన వ్యక్తుల కలయిక వలన మేలు జరుగుతుంది. 
 
కన్య: ఉపాధ్యాయులు విశ్రాంతికై చేయు యత్నాలు అనుకూలిస్తాయి. ఇతరుల సాయం కోసం ఎదురు చూడకుండా మీ యత్నాలు సాగించండి. స్త్రీలపై శకునాలు, చుట్టపక్కల వారి ప్రభావం అధికంగా ఉంటుంది. పత్రికా సంస్థలలోని వారికి మార్పులు అనుకూలిస్తాయి. కొబ్బరి, పండ్లు, పూల వ్యాపారులకు లాభదాయకం.   
 
తుల: ఆర్థిక పరిస్థితి ప్రోత్సాహకరంగా ఉంటుంది. స్త్రీలకు పనివారలతో చికాకులు అధికం. పాత స్నేహితులను కలుసుకుంటారు. ఏ యత్నం కలిసిరాక పోవడంతో నిరుద్యోగులు అసంతృప్తికి లోనవుతారు. ఆత్మీయులకు విలువైన కానుకలు చదివించుకుంటారు. చేపట్టిన పనులు ఆశించిన విధంగా సాగవు.  
 
వృశ్చికం: ఉద్యోగస్తులు విశ్రాంతికై చేయు ప్రయత్నాలు ఫలిస్తాయి. అందరితో కలిసి విందు వినోదాలలో పాల్గొంటారు. బంధువులను కలుసుకుంటారు. పాత వస్తువులను కొని ఇబ్బందులను ఎదుర్కుంటారు. స్త్రీలకు కాళ్ళు, నడుము, నరాలకు సంబంధించిన సమస్యలు ఎదుర్కుంటారు. స్థిరాస్తిని అమర్చుకోవాలనే కోరిక నెరవేరుతుంది.  
 
ధనస్సు: వృత్తి, వ్యాపారాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. మీ అభిరుచులకు తగిన విధంగా కుటుంబ సభ్యులు మసలుకుంటారు. మీ సంతానం కోసం ధనం బాగా ఖర్చు చేస్తారు. మీ యత్నాలకు జీవిత భాగస్వామి తోడ్పాటు లభిస్తుంది. దైవ దర్శనాలు చేసుకుంటారు. చేపట్టిన పనులు విసుగు కలిగించినా మెుండిగా పూర్తిచేస్తారు.  
 
మకరం: ఆర్థిక విషయాల్లో ఏకాగ్రత అవసరం. పెద్దలతో ఆస్థి వ్యవహారాలు సంప్రదింపులు జరుపుతారు. లీజు, నూతన కాంట్రాక్టులు, ఏజెన్సీలు అనుకూలిస్తాయి. రుణాలు చేబదుళ్లకు యత్నాలు సాగిస్తారు. ముఖ్యమైన పనులు ఆశించినరీతిలో పూర్తిచేస్తారు. వాహనం ఇతరులకు ఇచ్చి ఇబ్బందులను ఎదుర్కుంటారు.     
 
కుంభం: టెండర్లు చేజిక్కించుకుంటారు. ఎలక్ట్రికల్, ఎలక్ట్రానికల్, మెకానికల్ రంగాల వారికి ఆశాజనకం. మెుండి బాకీలు వసూలవుతాయి. భాగస్వామికి చర్చల్లో కొంత పురోగతి కనిపిస్తుంది. ఉపాధ్యాయులకు పని భారం తగ్గి ఊపిరి పీల్చుకుంటారు. సొంత వ్యాపారం చేయాలనే మీ ఆలోచన కార్యరూపం దాల్చుతుంది.    
 
మీనం: నిర్మాణ కార్యక్రమాలలో ప్రోత్సాహం కానవస్తుంది. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడుతాయి. ఊహించని అవకాశాలు వస్తాయి. కుటుంబీకులు మీ అభిప్రాయాలతో ఏకీభవిస్తారు. మీరు ఓ స్నేహితునితో కలిసి మీ లక్ష్యాన్ని చేరుకోవడానికి కృషిచేస్తారు. దైవ కార్యక్రమాల కోసం ధనం బాగా ఖర్చు చేస్తారు.