శనివారం, 25 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By రామన్
Last Updated : సోమవారం, 10 డిశెంబరు 2018 (09:57 IST)

10-12-2018 - సోమవారం మీ రాశిఫలితాలు ఇలా వున్నాయ్

మేషం: బ్యాంకింగ్ రంగాలలోని వారికి అపరిచిత వ్యక్తుల పట్ల మెళకువ అవసరం. బంధువుల రాకతో గృహంలో సందడి కానవస్తుంది. ఫర్నిచర్ అమరికలకు అవసరమైన నిధులు సమకూర్చుకోవడంలో ఇబ్బందులను ఎదుర్కుంటారు. విద్యార్థినులు ప్రేమ వ్యవహారాలకు దూరంగా ఉండడం మంచిది.
  
 
వృషభం: హోటల్, క్యాటరింగ్ రంగాలవారికి లాభదాయకంగా ఉంటుంది. స్త్రీల ఆరోగ్యం మందగిస్తుంది. వ్యాపారాభివృద్ధికి పలు పథకాలు అమలు చేస్తారు. మిమ్మల్ని పొగడేవారే కానీ సహకరించే వారుండరన్న వాస్తవం గ్రహించండి. రుణం సమయానికి సమకూరడం వలన ఆర్థిక ఇబ్బందులు తలెత్తగలవు.  
 
మిధునం: స్టేషనరీ, ప్రింటింగ్ రంగాల వారికి ఆర్ధికాభివృద్ధి, పురోభివృద్ధి. మీ గౌరవానికి భంగం కలిగే సంఘటనలు ఎదురవుతాయి. సన్నిహితుల వైఖరిలో మార్పు ఆవేదన కలిగిస్తుంది. నూతన పరిచయాలు మీ పురోభివృద్ధికి నాందీ పలుకుతాయి. కొన్ని వ్యవహారాలు సానుకూలతకు ధనం బాగా వెచ్చించాల్సి ఉంటుంది. 
 
కర్కాటకం: ఆర్థిక వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. కొత్త వ్యక్తులను దరిచేరనీయకండి. కాంట్రాక్టర్లకు రావలసిన ధనం చేతికందుతుంది. చేతి వృత్తుల వారికి సదవకాశాలు లభిస్తాయి. రాజకీయ నాయకలు సభలు, సమావేశాల్లో పాల్గొంటారు. విదేశాలు వెళ్ళడానికి చేయు ప్రయత్నాలు వాయిదాపడుతాయి.   
 
సింహం: ప్రైవేటు సంస్థల్లో వారు మార్పులకై చేయు ప్రయత్నాలు అనుకూలిస్తాయి. విద్యార్థులకు చదువుల పట్ల ఏకాగ్రత చాలా అవసరం. ఆత్మీయుల నుండి ఆహ్వానాలు అందుకుంటారు. ఉపాధి పథకాలపై నిరుద్యోగులు దృష్టి పెడతారు. ధనం ఏ కొంతైనా నిల్వ చేయడం వలన సంతృప్తి కానవస్తుంది.  
 
కన్య: కోర్టు తీర్పులు మీకు అనుకూలంగా వచ్చే సూచనలున్నాయి. ఉద్యోగస్తులకు విధి నిర్వహణలో ఏకాగ్రత, పనియందు అంకితభావం అవసరం. స్టేషనరీ, ప్రింటింగ్ రంగాలవారికి పురోభివృద్ధి. హామీలు, మధ్యవర్తిత్వాలకు దూరంగా ఉండడం క్షేమదాయకం. ఎదుటివారిని గమనించి ముందుకు సాగండి.  
 
తుల: ఉపాధ్యాయులకు, రిప్రజెంటేటివ్‌లకు సదవకాశాలు లభిస్తాయి. ఉత్తర ప్రత్యుత్తరాలు సమర్ధంగా నిర్వహిస్తారు. ఆలయాలను సందర్శిస్తారు. ప్లీడర్లకు, ప్లీడరు గుమస్తాలకు శ్రమకు తగిన ప్రతిఫలం కానరాగలదు. విద్యార్థినులు ఒత్తిడి, చికాకులకు గురవుతారు. హామీలు, మధ్యవర్తిత్వాలకు దూరంగా ఉండడం క్షేమదాయకం. 
 
వృశ్చికం: ఆర్థిక ఇబ్బంది లేకపోయినా సంతృప్తికానరాదు. సిమెంటు, కలప, ఐరన్, ఇటుక వ్యాపారులకు మందకొడిగా ఉంటుంది. శ్రమాధిక్యత, వాతావరణంలో మార్పు వలన స్త్రీల ఆరోగ్యం మందగిస్తుంది. పట్టువిడుపు ధోరణితో వ్యవహరించడం వలన కొన్ని పనులు మీకు సానుకూలమవుతాయి. దూరప్రయాణాలు అనుకూలిస్తాయి.  
 
ధనస్సు: కూర, పండ్లు, కొబ్బరి, ధాన్య స్టాకిస్టులకు కలిసివచ్చేకాలం. ప్రయాణాలలో నూతన పరిచయాలేర్పడుతాయి. గృహంలో మార్పులు, చేర్పులు అనుకున్నతం సంతృప్తి. చిట్స్‌, ఫైనాన్స్, బ్యాంకింగ్ రంగాలలో వారికి మెళకువ అవసరం. ఒక విషయంలో మీ జీవిత భాగస్వామి సలహా పాటించడడం వలన కలిసిరాగలదు.  
 
మకరం: స్త్రీలు నరాలకు సంబంధించిన చికాకులు ఎదుర్కుంటారు. ఏజెంట్లు, మార్కెట్ రంగాల వారు అతికష్టంమ్మీద టార్గెట్‌ను పూర్తిచేస్తారు. అందరితో సఖ్యతగా మెలుగుతూ ఉల్లాసంగా గడుపుతారు. విద్యార్థులకు అందిన ఒక సమాచారం కొత్త ఉత్సాహం ఇస్తుంది. ఉపాధ్యాయులు అధిక శ్రమను ఎదుర్కుంటారు.     
 
కుంభం: స్థిరాస్తి కొనుగోలు లేదా అభివృద్ధి దిశగా మీ ఆలోచనులుంటాయి. ఉద్యోగస్తులకు కార్యాలయ పనులతో పాటు సొంత పనులు కూడా పూర్తికాగలవు. పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. ధనం నిల్వ చేయాలనే మీ ఆలోచనల ఫలించదు. నూతన పరిచయాలు, సంబంధ బాంధవ్యాలు మీ పురోభివృద్ధికి ఎంతగానో సహకరిస్తాయి.    
 
మీనం: ఆర్థిక లావాదేవీలు, కుటుంబ సమస్యలు చక్కగా పరిష్కరిస్తారు. పాతమిత్రుల కలయికతో గత విషయాలు జ్ఞప్తికి వస్తాయి. నూతన పెట్టుబడుల విషయంలో మెళకువ అవసరం. స్త్రీలకు అలంకారాలు, గృహోపకరణాల పట్ల మక్కువ పెరుగుతుంది. మీ అభిప్రాయాలకు మంచి స్పందన లభిస్తుంది.