శుక్రవారం, 24 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By రామన్
Last Updated : బుధవారం, 12 డిశెంబరు 2018 (08:55 IST)

12-12-2018 బుధవారం దినఫలాలు - రాబడికి మించిన ఖర్చులు, పెరిగిన ధరలు...

మేషం: మీరు ప్రేమించే వ్యక్తితో మరింత ఆనందాన్ని పొందుతారు. కొబ్బరి, పండ్లు, పూల, చిరు వ్యాపారులకు పురోభివృద్ధి కానవస్తుంది. సంఘంలో పలుకుబడి కలిగిన వ్యక్తులతో పరిచయాల ఏర్పడుతాయి. మీ కళత్ర మెుండివైఖరి మీకెంతో చికాకు కలిగిస్తుంది. ఆకస్మికంగా మీలే వేదాంతో ధోరణి కానరాగలదు.  
 
వృషభం: ఐరన్, ఆటోమోబైల్ రంగాల్లో వారికి లాభదాయకంగా ఉంటుంది. ప్రముఖులను కలుసుకుంటారు. సన్నిహితులు నుండి ఆకర్షణీయమైన కానుకలు అందుకుంటారు. చేపట్టిన పనులు విసుకు కలిగించినా మెుండిగా పూర్తిచేస్తారు. రాబడికి మించిన ఖర్చులు, పెరిగిన ధరలు నిరుత్సాహ పరుస్తాయి.  
 
మిధునం: వ్యాపార ఆర్ధికాభివృద్ధికి చేయు కృషిలో ఆశాజనకమైన మార్పులు ఉంటాయి. స్త్రీలకు పుట్టింటిపై మమకారం పెరుగుతుంది. నూతన పరిచయాలు, సంబంధ బాంధవ్యాలు మీ పురోభివృద్ధికి ఎంతగానో సహకరిస్తాయి. బంధువులతో ఉల్లాసంగా గడుపుతారు. పాత వస్తువులను కొని సమస్యలు తెచ్చుకోకండి.  
 
కర్కాటకం: కాంట్రాక్టర్లకు లభించిన టెండర్లు నిరుత్సాహ పరుస్తాయి. నూతన వ్యాపారాల పట్ల ఆకర్షితులవుతారు. దైవ దర్శనాలలో ఇబ్బందులను ఎదుర్కుంటారు. స్త్రీలు విశ్రాంతికై చేయు యత్నాలు ఫలించవు. పాత సంఘటనలు గుర్తుకు తెచ్చుకుంటారు. మీ సంతానం విద్యా, వివాహాది విషయాలపై శ్రద్ధ కనబరుస్తారు.   
 
సింహం: రాజకీయనాయకులకు మెళకువ అవసరం. దూరప్రయాణాలు అనుకూలిస్తాయి. స్థిరాస్తుల అమ్మకానికై చేయు ప్రయత్నాలు వాయిదా పడడం మంచిది. ఉపాధ్యాయులకు సంఘంలో మంచి గుర్తింపు, రాణింపు లభిస్తుంది. ముఖ్యులకు బహుమతులు అందజేస్తారు. బంధువుల రాకతో గృహంలో సందడి కానవస్తుంది.  
 
కన్య: ఆర్ధిక విషయాలలో ఒడిదుడుకులు తొలగిపోతాయి. బ్యాంక్ వ్యవహారాలలో ఒత్తిడి, చికాకులను అధికంగా ఎదుర్కుంటారు. విదేశీయాన యత్నాలు అనుకూలిస్తాయి. మిమ్మల్ని పొగిడే వారే కానీ సహకరించే వారుండరు. రాజకీయనాయకులు సభలు, సమావేశాలలో హుందాగా వ్యవహరించి అందరినీ ఆకట్టుకుంటారు.    
 
తుల: ఉద్యోగస్తులు అనవసర విషయాలకు, అపరిచిత వ్యక్తులకు దూరంగా ఉండడం మంచిది. దూరప్రయాణాలు అనుకూలిస్తాయి. నిరుద్యోగులు నిరుత్సాహం వీడీ ఆత్మవిశ్వాసంతో యత్నాలు కొనసాగించడం మంచిది. మీ ఆశయం నెరవేరడానికి బాగా శ్రమించవలసి వస్తుంది. స్త్రీల పట్టుదల వలన కుటుంబ సౌఖ్యం అంతగా ఉండదు.  
 
వృశ్చికం: స్థిర, చరాస్తుల విషయంలో ఒక నిర్ణయానికి రాలేకపోతారు. ముఖ్యమైన విషయాల్లో సమయోచిత నిర్ణయాలు తీసుకుంటారు. గృహంలో మార్పులు, చేర్పులు వాయిదా పడడం మంచిది. మీ కోపాన్ని, చిరాకును ఎక్కువగా ప్రదర్శించడం మంచిది కాదు. ఉపాధ్యాయులు ప్రతి విషయంలోను ఆచితూచి వ్యవహరించవలసి ఉంటుంది.  
 
ధనస్సు: వృత్తి, వాణిజ్య రంగాల్లో వారికి ఒత్తిడి అధికమవుతుంది. ఏమరుపాటు తనంతో ఉద్యోగస్తులకు ఇబ్బందులు తప్పవు. తప్పనిసరి చెల్లింపులు వాయిదా వేయడం వలన ఇబ్బందులు ఎదుర్కుంటారు. నిరుద్యోగులు నిరాశ, నిస్పృహలకు లోనవుతారు. కళాకారులు, సినిమా రంగాల్లో వారికి అభిమాన బృందాలు పెరుగుతాయి.  
 
మకరం: శ్రీవారు, శ్రీమతి గౌరవ ప్రతిష్టలకు భంగం కలిగించే పరిణామాలు ఎదుర్కుంటారు. ఖర్చులు రాబడికి మించడంతో చేబదుళ్ళు, రుణాలు స్వీకరిస్తారు. దైవ, సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. స్త్రీలకు టి.వి. కార్యక్రమాలకు సంబంధించిన ఆహ్వానాలు అందుతాయి. వ్యాపార విస్తరణలకు అనుమతులు వస్తాయి.    
 
కుంభం: ఆర్ధికస్థితి కొంతమేరకు మెరుగుపడుతుంది. చేపట్టిన పనులు అసంపూర్ణంగా ముగించవలసి వస్తుంది. బంధుమిత్రులతో ఉల్లాసంగా గడుపుతారు. స్త్రీలు ఇతరుల కుటుంబ విషయాల్లో తలదూర్చడం వలన ఇబ్బందులకు గురి కావలసివస్తుంది. పెద్దలను, ప్రముఖఉలను కలుసుకుని వారికి బహుమతులు అందజేస్తారు.    
 
మీనం: స్త్రీలు పుణ్యక్షేత్రాలను దర్శిస్తారు. మొండిధైర్యంతో శ్రమించి అనుకున్నది సాధిస్తారు. కలప, ఐరన్, ఇటుక, ఇసుక, సిమెంటు వ్యాపారులకు సామాన్యం. ఆస్థి విషయంలో సోదరుల నుండి ప్రతికూలతలు ఎదుర్కోవలసివస్తుంది. పత్రికా, ప్రైవేట సంస్థలలోని వారికి ఒత్తిడి, పనిభారం వంటి సమస్యలు తలెత్తుతాయి.