గురువారం, 9 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By రామన్
Last Updated : గురువారం, 13 డిశెంబరు 2018 (08:50 IST)

13-12-2018 గురువారం దినఫలాలు - విదేశీయానం కోసం చేసే యత్నాల్లో...

మేషం: రాజకీయాలవారు కార్యకర్తల వలన సమస్యలను ఎదుర్కొనవ తప్పదు. కోర్టు వ్యవహారాలు వాయిదాపడడం మంచిది. స్త్రీల పట్టుదల, మెుండివైఖరి సమస్యలకు దారితీస్తుంది. ట్రాన్‌పోర్ట్, ఆటోమోబైల్, మెకానికల్ రంగాల వారికి కలిసిరాగలదు. స్టేషనరీ, ప్రింటింగ్ రంగాల వారికి పురోభివృద్ధి కానవస్తుంది.  
 
వృషభం: విదేశీయానం కోసం చేసే యత్నాల్లో ఆటంకాలను ఎదుర్కుంటారు. సోదరీసోదరుల మధ్య అవగాహన ఏర్పడుతుంది. బంధుమిత్రుల కలయిక సంతోషాన్ని, ప్రశాంతతను కలిగిస్తుంది. ప్రైవేటు సంస్థలలోని వారు మార్పులకే చేయు యత్నాల్లో ఆటంకాలు తప్పవు. ఊహించని ఖర్చులు మీ అంచనాలు దాటగలవు.   
 
మిధునం: ఆర్థిక లావాదేవీలు, వ్యాపార విషయాల్లో ఏకాగ్రత అవసరం. దంపతుల మధ్య అభిప్రాయ భేదాలు తలెత్తుతాయి. ఆలయాలను సందర్శిస్తారు. ఉద్యోగస్తులు సమర్థంగా పనిచేసి పై అధికారులను మెప్పిస్తారు. విద్యార్ధులు ప్రేమ వ్యవహారాలకు, అనవసర విషయాలకు దూరంగా ఉండడం క్షేమదాయకంగా ఉంటుంది.  
 
కర్కాటకం: ప్రింటింగ్ రంగాల వారికి కొత్త అవకాశాలు లభిస్తాయి. వ్యాపారాల్లో ఆటుపోట్లు ఎదురైనా ధైర్యంగా ముందుకు సాగండి. ఆలయాలను సందర్శిస్తారు. ఏ వ్యక్తికీ అతి చనువు ఇవ్వడం మంచిది కాదు. చిన్ననాటి వ్యక్తుల కలయికతో మధురానుభూతి చెందుతారు. గృహ నిర్మాణాలు, మరమ్మత్తులు మందకొడిగా సాగుతాయి.   
 
సింహం: విద్యార్థినుల్లో మందకొడితనం, ఇతరత్రా చికాకులు అధికమవుతాయి. డాక్టర్లకు అనుభవజ్ఞులతో పరిచయాలు, మంచి గుర్తింపు, రాణింపు లభిస్తుంది. స్త్రీలకు సంపాదన పట్ల ఆసక్తితో పాటు అవకాశాలు కలిసిరాగలవు. మీ అవసరాలకు ధన సహాయం అడగడానికి మొహమ్మాటపడుతారు. 
 
కన్య: పారిశ్రామిక రంగాల వారికి ఇసుకు, క్వారీ కాంట్రాక్టర్లకు ఊహించని సమస్యలెదురవుతాయి. స్త్రీలకు పనివారలతో చికాకులు అధికమవుతాయి. బంధుమిత్రుల కలయికతో ఉత్సాహం చెందుతారు. వృత్తి వ్యాపారాల్లో రాణించడానికి బాగా శ్రమించాలి. రావలసిన ధనం అందటంతో పొదుపు పథకాల పట్ల దృష్టి సారిస్తారు.   
 
తుల: ఓర్పు, పట్టుదలతో శ్రమించి అనుకున్నది సాధిస్తారు. ఒక వ్యవహారం నిమిత్తం ఆసస్మికంగా ప్రయాణం చేయవలసి వస్తుంది. దంపతుల మధ్య కొత్త విషయాలు చర్చకు వస్తాయి. నిరుద్యోగులు నిరుత్సాహం వీడి ఇంటర్వ్యూలకు హాజరు కావడం మంచిది. కుటుంబీకుల కోసం ధనం బాగా వెచ్చిస్తారు.  
 
వృశ్చికం: మీ జీవితభాగస్వామి సలహా పాటించడం శ్రేయస్కరం. మీ అవసరాలు వాయిదా వేసుకోవలసి వస్తుంది. నూనత వ్యాపారాలు, ఉపాధి పథకాలు సంతృప్తికరంగా సాగుతాయి. ప్రింటింగ్ రంగాల వారికి ఒత్తిడి, పనిభారం అధికం, కొన్ని సమస్యలు చిన్నవే అయినా మనశ్శాంతిని దూరం చేస్తాయి.  
 
ధనస్సు: ఉన్నతస్థాయి అధికారులకు కిందిస్థాయి సిబ్బంది సహాయ సహకారాలు లభిస్తాయి. ఆశలొదిలేసుకున్న మెుండిబాకీలు వసూలవుతాయి. కొత్త భాగస్వాములను చేర్చుకునే విషయంలో పునరాలోచన మంచిది. ముఖ్యుల గురించి ఆందోళన చెందుతారు. వాహనం ఇతరులకు ఇచ్చి ఇబ్బందులను ఎదుర్కుంటారు. 
 
మకరం: బ్యాంకు వ్యవహారాలలో అపరచిత వ్యక్తుల పట్ల మెళకువ అవసరం. ఉపాధ్యాయులు ఎదుటివారితో మితంగా సంభాషించడం ఉత్తమం. ఆలయాలను సందర్శిస్తారు. కోర్టు వ్యవహారాలు నిరుత్సాహ పరుస్తాయి. మీ విజ్ఞత, నిజాయితీలకు ప్రశంసలు లభిస్తాయి. ఒక స్థిరాస్తి అమర్చుకోవాలనే ఆలోచన స్పురిస్తుంది.     
 
కుంభం: ప్రభుత్వ కార్యాలయాల్లో మీ పనులు వాయిదాపడుతాయి. కలప, సిమెంటు, ఇసుక, ఇటుక వ్యాపారులకు ఆశాజనకం. మీ వాహనం, ఇతర విలువైన వస్తువులు మరమ్మత్తులకు గురవుతాయి. ప్రింటింగ్ రంగాల వారు పత్రికా, వార్తా సంస్థలలోని వారు అక్షర దోషాలు తలెత్తకుండా జాగ్రత్త వహించాలి.    
 
మీనం: వైద్య, ఇంజనీరింగ్, సాంకేతిక రంగాల వారికి సదవకాశాలు లభిస్తాయి. దంపతుల మధ్య అన్యోన్యత చోటు చేసుకుంటుంది. విద్యార్థుల ఆలోచనులు తప్పుదారి పట్టే ఆస్కారం ఉంది. పాత్రికేయులకు ఒత్తిడి, పనిభారం అధికం. కొబ్బరి, పండ్లు, పూల, కూరగాయలు, చిరు వ్యాపారులకు కలిసిరాగలదు.