సంబంధిత వార్తలు
- దర్శకుడు ఆ మాట అనేసరికి పక్కకెళ్లి ఏడ్చాను... నటి ప్రగతి
- సంజయ్ దత్ ఓ ఫ్రాడ్... ఎవరన్నారు? బీ-టౌన్లో రచ్చరచ్చ
- ఆ హీరోతో నాకు సంబంధం ఉంది : అందుకే టార్చర్ పెట్టారు : అమలాపాల్
- నన్నలా చూస్తే పూరీ తట్టుకోలేడు... ప్రపంచమంతా శృంగారం చుట్టూనే... నటి హేమ
- రంగస్థలం గురించి సమంత ఏం చెప్పింది.. కేటీఆర్‌కు సమంత థ్యాంక్స్ ఎందుకు?
కన్యారాశి వారి లక్షణాలు ఇలా వుంటాయి
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఉత్తర రెండు, మూడు, నాలుగు పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాల్లో జన్మించిన జాతకులు కన్యారాశి కిందకు వస్తారు. ఈ రాశికి బుధుడు అధిపతి. ఉన్నత పదవులను అలంకరించే ఈ
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఉత్తర రెండు, మూడు, నాలుగు పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాల్లో జన్మించిన జాతకులు కన్యారాశి కిందకు వస్తారు. ఈ రాశికి బుధుడు అధిపతి. ఉన్నత పదవులను అలంకరించే ఈ రాశి జాతకులు ప్రాక్టికల్ మైండ్‌తో కలిగి వుంటారు. సిస్టమాటిక్‌గా వుంటారు. పెట్టుబడి తక్కువతో అధిక ఆదాయం రాబట్టాలని చూస్తారు. అయితే అధిక శ్రమతోనే వీరికి ధనార్జన చేకూరుతుంది. ఇతరులకు సహకరించేందుకు ముందుండే కన్యారాశి జాతకులు.. ఇతరులు ఏ స్థాయికి చెందిన వారైనా గౌరవమిస్తారు.
అయితే అనవసరమైన విషయాల్లో జోక్యం చేసుకోరు. కానీ ఎక్కడ ఏ విషయం జరిగినా ఈ జాతకులకు సమాచారం అందుతుంది. కొత్తగా ఏ విషయాన్నైనా ప్రారంభించేందుకు అనేకసార్లు ఆలోచిస్తారు. అంత సులభంగా ఏ కార్యాన్నీ మొదలెట్టరు. ఆరోగ్యంపై శ్రద్ధ తీసుకుంటారు. ఇతరులను సులభంగా ఆకట్టుకునే ఈ జాతకులు.. వాక్చాతుర్యంతో అందరినీ జయిస్తారు. అయితే చిన్న చిన్న విషయాలకే ఒత్తిడికి లోనవుతారు. గౌరవం, మర్యాద కోసం పాటుపడతారు. ఇతరులు చిన్నమాటన్నా పడరు. వీరికి స్నేహితుల సంఖ్య కూడా ఎక్కువే. ఇతరుల తప్పును సులభంగా ఎత్తిచూపే ఈ జాతకులు తమ తప్పులను గుర్తించినా.. వాటిని సరిదిద్దుకోలేరు.
ఇక మహిళలైతే.. భాగస్వామ్యులను తమ చేతుల్లో పెట్టుకునేందుకు శ్రమిస్తారు. ఆ విషయంలో సక్సెస్ అవుతారు. సమాజంలోనూ ఈ రాశి మహిళలు పురుషులకంటే ముందుంటారు. మహిళలు స్నేహితులు, బంధువులకు సన్నిహితంగా వుంటారు. ఇతరులపై ఆధారపడి జీవించడానికి ఇష్టపడరు. స్వేచ్ఛను కోరుకుంటారు. అయినప్పటికీ ఎవరినీ వ్యతిరేకించరు. పరిస్థితులకు తగినట్లు తమను తాము మార్చుకునే సత్తా వీరికుంటుందని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు.
తర్వాతి కథనం
