శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By pnr
Last Updated : గురువారం, 10 ఆగస్టు 2017 (10:06 IST)

సంజయ్ దత్ ఓ ఫ్రాడ్... ఎవరన్నారు? బీ-టౌన్‌లో రచ్చరచ్చ

ముంబై పేలుళ్ళ కేసులో ముద్దాయి, బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ ఓ వంచకుడట. ఆయన గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిదని మరో బాలీవుడ్ హీరో అంటున్నారు. ఇంతకీ ఈ మాటలు అన్న హీరో ఎవరన్నదే కదా మీ సందేహం. ఆయన ఎవరోక

ముంబై పేలుళ్ళ కేసులో ముద్దాయి, బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ ఓ వంచకుడట (ఫ్రాడ్). ఆయన గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిదని మరో బాలీవుడ్ హీరో అంటున్నారు. ఇంతకీ ఈ మాటలు అన్న హీరో ఎవరన్నదే కదా మీ సందేహం. ఆయన ఎవరోకాదు రణ్‌బీర్ కపూర్. మరో బాలీవుడ్ నటుడు. 
 
సంజయ్‌దత్ బయోపిక్‌లో రణ్‌బీర్ కపూర్ నటిస్తున్నారు. ఈ చిత్రం గురించి ప్రశ్నించిన మీడియాతో మాట్లాడుతూ, సంజయ్ దత్ అంత నిజాయతీగా ఉండటం సాధ్యం కాదన్నాడు. సంజు బాబాను అభిమానించే వారున్నారు, అలాగే ద్వేషించే వారు కూడా ఉన్నారు. అయితే ఈ సినిమా గురించి అడగ్గానే సంజు బాబా నిజాయతీగా తన జీవితంలో చోటుచేసుకున్న ఘటనలను వివరించారని చెప్పాడు. ఆయన నిజంగా చాలా గ్రేట్ అన్నాడు.
 
తాను అంత నిజాయతీగా ఉండే వాడిని కాదన్నాడు. ఆయన నిజజీవితం నుంచి ప్రేక్షకులకు ఎంతో కొంత మంచి చేరుతుందని ఆశాభావం వ్యక్తం చేశాడు. ఈ సినిమాలో నిజాలను నిక్కచ్చిగా చూపిస్తున్నామని చెప్పాడు. దీంతో సంజయ్ దత్ జీవితంలో చోటుచేసుకున్న ఎన్నో వివాదాస్పద అంశాలతో పాటు, ఈ ఖల్ నాయక్ ప్రేమాయణాలను కూడా ఇందులో చూపించనున్నారు.
 
అదేసమయంలో తామేమీ మహాత్మా గాంధీ బయోపిక్ తీయడం లేదని, ఒక ఫ్రాడ్ (వంచకుడి) కథను తెరకెక్కిస్తున్నామని అన్నాడు. కాగా, ఈ సినిమాలో సంజయ్ దత్ పాత్రలో రణ్‌బీర్ కపూర్ నటిస్తుండగా, దీనికి సంజయ్ దత్ స్నేహితుడు రాజ్ కుమార్ హిరానీ దర్శకత్వం వహిస్తున్నాడు.