సంబంధిత వార్తలు
- Chaturthi: చతుర్థి వ్రతం మే 30, శుక్రవారం వస్తోంది.. గణపతిని పూజిస్తే?
- Sani Pradosham: శనివారం మహా ప్రదోషం: పెరుగు అన్నాన్ని ప్రసాదంగా సమర్పిస్తే?
- శనిత్రయోదశి: శనివారం, త్రయోదశి తిథి.. విశేష పర్వదినం
- Sarva Pitru Amavasya 2025: ఏప్రిల్ 29న సర్వ అమావాస్య.. ఇవి చేస్తే పితృదోషాలుండవ్!
- Akshaya Tritiya 2025: అక్షయ తృతీయ 2025 -గంగా నది స్వర్గం నుండి భూమికి దిగివచ్చిన రోజు
Saturn: ఉత్తరాభద్ర నక్షత్రంలోకి శనీశ్వరుడి పరివర్తనం.. ఈ రాశులకు శుభం
నవగ్రహాల్లో శనిభగవానుడు పరివర్తనం చెందడం కొన్ని రాశులకు సానుకూల ఫలితాలను, మరికొన్ని రాశులకు ప్రతికూల ఫలితాలను ఇస్తుంది. ఈ ఏడాది మార్చి 29వ తేదీన శనీశ్వరుడు కుంభరాశి నుంచి మీనరాశికి మారాడు. ఆపై ఏప్రిల్ 28వ తేదీన ఉత్తరాభాద్ర నక్షత్రంలోకి అడుగుపెట్టారు.
మే 26న శని జయంతికి తర్వాత 11వ రోజున శని ఉత్తరాభాద్ర నక్షత్రానికి రెండో పాదానికి ప్రవేశిస్తారు. ఈ పరివర్తనం జూన్ 7, శనివారం జరుగనుంది. ఈ శని పరివర్తనంతో లాభపడే రాశుల గురించి తెలుసుకుందాం.
కన్యారాశి: శని పరివర్తనం కారణంగా ఈ రాశి వారికి జీవితంలో మార్పు తథ్యం. వివాహబంధాలు బలపడతాయి. ప్రేమలో విజయం సాధిస్తారు. అవివాహితులకు శుభ సమయం. ఆరోగ్యం మెరుగుపడుతుంది. వ్యాపారాల్లో వృద్ధి సాధిస్తారు. ఇన్నాళ్లు జరగని పనులు ఎలాంటి అడ్డంకులు లేకుండా పూర్తి అవుతాయి.
కర్కాటక రాశి: ఈ జాతకులు శని పరివర్తనం కారణంగా శుభ ఫలితాలను పొందుతారు. వ్యాపారంలో అభివృద్ధి వుంటుంది. కుటుంబంలో సఖ్యత నెలకొంటుంది. కొత్త ఇళ్లు కొనుగోలు, వాహనసౌఖ్యం వుంటుంది. వైవాహిక జీవితం సుఖమయంగా వుంటుంది.
మకర రాశి: మకరరాశికి ఈ శనిపరివర్తనం వల్ల ఆదాయం బాగుంటుంది. బంధువుల హాయిగా గడుపుతారు. ఇంతవరకు వున్న సమస్యలు పరిష్కారం అవుతాయి. ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి. వివాదాల నుంచి బయటపడతారు. వ్యక్తిగత సంబంధాలు ఏర్పడుతాయి. కుటుంబంతో ఉత్సాహంగా గడుపుతారు. సమాజంలో పేరు ప్రతిష్టలు ఇనుమడిస్తాయి.
తులా రాశి: ఈ రాశుల వారికి శని పరివర్తనం కారణంగా ఉపాధి అవకాశాలు మెరుగుపడుతాయి. కొత్త అవకాశాలు లభిస్తాయి. వ్యాపారాన్ని విస్తరిస్తారు. కుటుంబంలో ప్రశాంతత చేకూరుతుంది. ఈ శ్రమకు తగిన ప్రతిఫలం లభిస్తుంది.
కుంభరాశి: ఈ జాతకులకు శని పరివర్తనం కారణంగా అనుకున్న కోరికలు నెరవేరుతాయి. ప్రమోషన్ లభిస్తుంది. రావలసిన ధనం చేతికి అందుతుంది. సమాజంలో కీర్తిప్రతిష్టలు చేకూరుతాయి. కుటుంబంలో ఆహ్లాదం చోటుచేసుకుంటుంది. ఉన్నత పదవి చేపడతారు.
