మంగళవారం, 24 జూన్ 2025
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 30 మే 2025 (08:56 IST)

Chanakya Niti: భర్తపై భార్య ప్రేమ ఆ సమయాల్లో తేలిపోతుంది.. చాణక్యుడు

couple
ఆచార్య చాణక్యులు తన గ్రంథాలలో జీవితానికి సంబంధించిన పలు సూచనలను అందించారు. ఈ సూచనలు నేటి కాలంలో చాలా ఉపయోగకరంగా ఉన్నాయి. ఈ సూచనలను మన జీవితాలను అనుసరించి ఉత్తమ జీవితాన్ని గడపవచ్చు. చాణక్యులు భర్తపై భార్య ప్రేమ ఎంత గొప్పది అని ఈ సందర్భంలో కనిపెట్టవచ్చునని చెప్తున్నారు. 
 
ఒక వ్యక్తికి అదృష్టం లేదు, దురదృష్టం అతనితో నిరంతరం కొనసాగుతున్నప్పుడు.. ఆ పరిస్థితుల్లో భార్య నిజాయితీ ప్రేమ పరీక్షించబడుతుందని.. ఆమె నైజం ఏంటో అర్థమైపోతుందని చాణక్యుడు చెప్పారు. అలాంటి పరిస్థితిలో భార్య సహకరించకపోతే, అతని ప్రేమ ఏంటో అర్థమైపోతుందని చాణక్యులు తెలిపారు. 
 
అలాగే ఒక మంచి ఉద్యోగి అతని పనిని చూసి గుర్తించాలి అని చాణక్యుడు చెప్పారు. ఒక ఉద్యోగి అనేక సార్లు చేసిన తప్పునే తిరిగి చేస్తున్నప్పుడు అతనిని వెంటనే వదిలివేయాలి. ఎందుకంటే అటువంటి ఉద్యోగులతో యజమానులకే నష్టమని గమనించాలి.
 
అలాగే బంధువుల్లో ఎవరు గొప్పవారు అని గుర్తించాలంటే.. జీవితంలో కష్టాలు వచ్చినప్పుడు, కుటుంబ సభ్యులను, బంధువుల గురించి తెలుసుకోవచ్చు. అలాంటి పరిస్థితుల్లో మీకు అండగా ఉండేవారే నిజమైన బంధువులు. కాబట్టి, కష్టకాలంలో సహాయం చేసేవారిని మాత్రమే నమ్మండి.
 
ఒక మంచి స్నేహితుడు ఎలాంటి పరిస్థితుల్లోనూ మిమ్మల్ని విడిచిపెట్టడు. మీకు ఏ సమస్య వచ్చినా సరే. కష్టకాలంలో మీకు తోడుగా నిలిచే వారు నిజమైన స్నేహితులు. అటువంటి స్నేహితులు మీ వెంట వుంటే  మీ కష్టాల నుండి సులభంగా బయటపడవచ్చునని చాణక్యులు తెలిపారు.