సంబంధిత వార్తలు
- గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో జర్నలిస్టులకు ఇళ్లు... జర్నలిస్టుల గృహనిర్మాణంపై చర్చ
- మన గృహంలోనే తథాస్తు దేవతలు వుంటారా?
- దుబాయ్ రాకుమారిని కిడ్నాప్ చేసిన డి గ్యాంగ్... ఎలా?
- ఏసీ (Air Conditioner) లేకున్నా ఇల్లు చల్లగా పెట్టుకోవచ్చు.. ఎలా అంటే?
- ఈ మొక్కలు ఏం చేస్తాయో తెలుసా? చదివితే ఆశ్చర్యపోతారు...
స్ఫటిక లింగాన్ని పది నిమిషాలు అలా చూస్తూ నిలబడితేనే?
శైవ ఆగమ శాస్త్రం ప్రకారం.. లింగ ఆరాధన కీలకమైంది. 32 రకాల పవిత్రమైన వస్తువులతో లింగాలను తయారు చేస్తుంటారు. ఏ వస్తువుతో లింగం తయారవుతుందో ఆ వస్తువును బట్టి ఆధ్యాత్మిక శక్తి ఆ లింగంలో నిగూఢమైవుంటుందని ఆధ
శైవ ఆగమ శాస్త్రం ప్రకారం.. లింగ ఆరాధన కీలకమైంది. 32 రకాల పవిత్రమైన వస్తువులతో లింగాలను తయారు చేస్తుంటారు. ఏ వస్తువుతో లింగం తయారవుతుందో ఆ వస్తువును బట్టి ఆధ్యాత్మిక శక్తి ఆ లింగంలో నిగూఢమైవుంటుందని ఆధ్యాత్మిక పండితులు సూచిస్తున్నారు.
32 వస్తువులతో గాకుండా.. స్వయంభు లింగాలు కూడా ఉద్భవించాయి. అలా స్వయంభు లింగాల్లో ఒకటే స్ఫటిక లింగం. స్ఫటికం శివుని కేశాలలో అలంకరించబడిన చంద్రుని నుంచి రాలినదని చెప్పబడుతోంది. స్ఫటికాన్ని ఆంగ్లంలో క్రిస్టల్ అంటారు.
స్వచ్ఛంగా.. అద్దంలా మెరిసే ఈ లింగానికి చలువ తత్త్వాన్ని కలిగివుంటుంది. అందుకే స్ఫటిక మాలలను చాలామంది ధరిస్తుంటారు. స్ఫటికం హిమాలయాల్లో, శంకరగిరి పర్వతాల్లో లభిస్తాయి. వీటి విలువ కూడా ఎక్కువే. వ్యాపారులు ఈ స్ఫటిక లింగాన్ని ఇంట్లోనూ లేదా వ్యాపార కేంద్రాల్లో వుంచి పూజించవచ్చు. తద్వారా ఆదాయం, లాభం చేకూరుతుంది. స్ఫటిక లింగాన్ని పద్ధతి ప్రకారం పూజిస్తే ఈతిబాధలుండవు.
విద్యార్థులు కూడా స్ఫటిక లింగాన్ని పూజిస్తే జ్ఞాపకశక్తి పెరుగుతుంది. స్ఫటిక లింగాన్ని పది నిమిషాల పాటు చూస్తూ వుంటేనే మంచి జ్ఞాపకశక్తి, ఏకాగ్రత పెరుగుతుంది. స్ఫటిక లింగాన్ని పూజించేవారు నిజాయితీగా వ్యవహరించాల్సి వుంటుందని ఆధ్యాత్మిక పండితులు సూచిస్తున్నారు.
