శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By pnr
Last Updated : శుక్రవారం, 20 ఏప్రియల్ 2018 (08:51 IST)

శుక్రవారం దినఫలాలు (20-04-018)... ఒత్తిళ్ళకు లొంగకుండా స్థిర చిత్తంతో

మేషం: చిన్నతరహా, కుటీర పరిశ్రమల వారికి ప్రోత్సాహకరం, చిరు వ్యాపారులకు చికాకులు తప్పవు. సన్నిహితులతో కలిసి చేపట్టిన పనులు సమీక్షిస్తారు. రిప్రజెంటేటివ్‌లకు ఒత్తిడి పెరుగుతుంది. మీ సంకల్పసిద్ధికి నిరంతర

మేషం: చిన్నతరహా, కుటీర పరిశ్రమల వారికి ప్రోత్సాహకరం, చిరు వ్యాపారులకు చికాకులు తప్పవు. సన్నిహితులతో కలిసి చేపట్టిన పనులు సమీక్షిస్తారు. రిప్రజెంటేటివ్‌లకు ఒత్తిడి పెరుగుతుంది. మీ సంకల్పసిద్ధికి నిరంతరం శ్రమ, పట్టుదల చాలా ముఖ్యమని గమనించండి. స్త్రీలకు ఆర్జన పట్ల ఆసక్తి పెరుగుతుంది. 
 
వృషభం: స్త్రీలు గత కొంత కాలంగా అనుభవిస్తున్న సమస్యలు పరిష్కారం కాగలవు. ఉద్యోగస్తులు ఒత్తిళ్ళకు లొంగకుండా స్థిర చిత్తంతో వ్యవహరించవలసి ఉంటుంది. ఉపాధ్యాయులకు ఒత్తిడి, అకౌంట్స్ రంగాల వారికి పనిభారం తప్పదు. తొందరపాటుతనం వల్ల ధననష్టం, శ్రమాధిక్యత వంటి చికాకులు ఎదుర్కుంటారు.
 
మిథునం: వ్యాపారాలు, లీజు, ఏజెన్సీ వ్యవహారాలలో మెళకువ వహించండి. మీ కష్టం, సమర్థతలను ఇతరులు తమ స్వార్థానికి వాడుకుంటారు. నిరుద్యోగులు ఉపాధి పథకాల్లో నిలదొక్కుకుంటారు. అకాలభోజనం, శ్రమాధిక్యత వల్ల పెద్దల ఆరోగ్యం మందగిస్తుంది. కోర్టు వ్యవహారాల్లో ప్లీడర్లు, ప్లీడరు గుమాస్తాలకు ఆటంకాలు తప్పవు.
 
కర్కాటకం: తలకు మించిన బాధ్యతలతో తలమునకలవుతారు. కాస్త ఓపికగా వ్యవహరించండి. ఉద్యోగస్తులు ఒత్తిళ్ళు, ఆకర్షణీయ ప్రకటనలకు దూరంగా ఉండటం క్షేమదాయకం. దైవ కార్యక్రమాలలో ఒత్తిడి, చికాకులను ఎదుర్కొంటారు. గత స్మృతులు జ్ఞప్తికి వస్తాయి. రావలసిన ధనం కొంత ఆలస్యంగానైనా చేతికి అందుతుంది.
 
సింహం: మీ శ్రీమతిలో వచ్చిన మార్పు మీకెంతో సంతృప్తినిస్తుంది. మీ చికాకులు, ఇబ్బందులు తాత్కాలికమేనని గమనించండి. పెద్దమెుత్తం నగదు, ఆభరణాలతో ప్రయాణం క్షేమం కాదు. ఆలయ సందర్శనాల కోసం ధనం ఖర్చు చేస్తారు. ఒక వ్యవహారం నిమిత్తం ప్లీడర్లు, ప్రముఖులతో సంప్రదింపులు జరుపుతారు.
 
కన్య: స్త్రీలు నరాలు, ఉదరానికి సంబంధించిన చికాకులు ఎదుర్కుంటారు. వారసత్వపు వ్యవహారాలలో చికాకులు ఎదుర్కొంటారు. మీ శ్రీమతి, సంతానం గొంతెమ్మ కోరికలు ఇబ్బంది కలిగిస్తాయి. ఏ కొంతమెుత్తమైనా పొదుపు చేయాలన్న మీ ఆలోచన ఫలిస్తుంది. మీ బలహీనతలు, మాటతీరు అదుపులో ఉంచుకోవటం క్షేమదాయకం.
 
తుల: ఉద్యోగ విరమణ చేసిన వారికి అధికారులు, సహోద్యోగులు ఘనంగా వీడ్కోలు పలుకుతారు. స్త్రీలకు శ్రీవారి తరపు బంధువుల రాక ఇబ్బంది కలిగిస్తుంది. సోదరులతో ఏకీభవించలేకపోతారు. వ్యాపారాల్లో సంతృప్తికరమైన లాభాలు, అనుభవం గడిస్తారు. వాహనం, విలువైన వస్తువులు మరమ్మతులకు గురికావచ్చు.
 
వృశ్చికం: ఆత్మీయులతో మీ సమస్యలు చెప్పుకోవడం ద్వారా పరిష్కార మార్గం, మానసిక ప్రశాంతత పొందుతారు. సామూహికదైవ కార్యక్రమాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. పాత బాకీలు వసూలవుతాయి. ఇతరులు చెప్పిన మాటపై దృష్టి పెట్టకండి. ఉద్యోగస్తులు పైఅధికారులతో సంభాషించేటప్పుడు మెలకువ వహించండి.
 
ధనస్సు: దూరపు బంధువులను కలుసుకొని ఆసక్తికరమైన విషయాలు చర్చిస్తారు. రాజకీయ, పారిశ్రామిక రంగాల వారికి విదేశీ పర్యటనలు అనుకూలిస్తాయి. మీ కోపాన్ని, చిరాకును ఎక్కువగా ప్రదర్శించటం మంచిది కాదు. ట్రాన్స్‌పోర్టు, ఆటోమెుబైల్, మెకానికల్ రంగాల వారికి కలిసిరాగలదు. స్త్రీలకు స్వీయ ఆర్జన పట్ల ఆసక్తి, ప్రోత్సాహం లభిస్తాయి. 
 
మకరం: ఆర్థిక ఒడిదుడుకులు తలెత్తినా మిత్రుల సహకారం వల్ల సమసిపోగలవు. ప్రింటింగ్, స్టేషనరీ రంగాలలోని వారికి మిశ్రమ ఫలితం. మీ శ్రీమతికి మీరంటే ప్రత్యేకాభిమానం కలుగుతుంది. కొన్ని బంధాలను నిలుపుకోవటానికి కష్టపడాల్సి వస్తుంది. మీ అభిరుచులకు తగిన విధంగా కుటుంబ సభ్యులు మసలుకుంటారు.
 
కుంభం: అధికారులతో సంభాషించేటపుడు మెళుకువ అవసరం. ప్రైవేటు సంస్థలలోని వారికి మార్పులు అనుకూలిస్తాయి. ప్రియతములలో మార్పు మీకు ఎంతో ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ప్రతి పని చేతిదాకా వచ్చి వెనక్కిపోవుడం ద్వారా ఆందోళన పెరుగుతుంది. మీరు చేయని కొన్ని పనులకు మీపై నిందలు పడే అవకాశం ఉంది.
 
మీనం: విద్యుత్ వస్తువుల పట్ల ఏకాగ్రత చూపుతారు. కొత్త ఉద్యోగ అవకాశాలు వచ్చినప్పటికి వాటిని సద్వినియోగం చేసుకోలేకపోతారు. మీరు చేయని కొన్ని పనులకు మీ మీద నిందలు మోపే అవకాశం ఉంది. ఎలక్ట్రానికల్, కంప్యూటర్ రంగాల పట్ల ఆసక్తి పెరుగును. బ్యాంకింగ్ రంగాల వారు ఒత్తిడి, చికాకులను ఎదుర్కుంటారు.