శుక్రవారం, 10 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By సెల్వి

శుక్రవారం మినప వడలు.. ఉప్పును కొనుగోలు చేస్తే?

Devi
చేతిలో డబ్బు నిలవట్లేదంటే.. శుక్రవారం ఇలా చేయాలి. ధనం వస్తూ వుంటుంది. ఖర్చు అవుతూ వుంటుంది. ఇలాంటి సందర్భంలో ఇంట్లో దానిమ్మ లేదా అరటి మొక్క నాటి రోజూ సాయంకాలం పూట వేళ దాని దగ్గర దీపం వెలిగించాలి. సోమవారం, శుక్రవారం శ్రీ సూక్తం పఠించాలి. ఇలా చేస్తే.. మీ ఇంట్లో లక్ష్మీదేవి స్థిరనివాసియై వుంటుంది. 
 
అలాగే శుక్రవారం పూట శ్రీ యంత్రం, కనకధార యంత్రం, కుబేర యంత్రం.. ఈ మూడింటిని ఇంట్లో పూజా స్థలంలో ఉంచి.. రోజూ పూజిస్తే లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది.

అలాగే ధన లాభం కలగడానికి శుక్రవారం, శనివారం సాయంత్రం సంధ్యా వేళ రెండు మినప వడలు పెద్దవి తీసుకుని.. వాటిపై కొంచెం పెరుగు, సింధూరం చిలకరించాలి. తర్వాత ఆ వడలు రావి చెట్టు కింద వుంచాలి. వెనక్కి తిరిగి చూడకూడదు. ఈ ప్రయోగం 21 రోజులు క్రమం తప్పకుండా చేస్తే ధనలాభం కలుగుతుంది. 
 
శుక్రవారం రాళ్ల ఉప్పును కొనుగోలు చేయాలి. ఉప్పును కాళ్ళతో తొక్క కూడదు. అలాగే బదులు కూడా తీసుకోకూడదు. అలాగే ఉప్పును చేతితో ఎవ్వరికీ ఏ రోజైనా ఇవ్వకూడదు.