సోమవారం, 23 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By సిహెచ్
Last Updated : మంగళవారం, 5 జనవరి 2021 (18:25 IST)

గుప్పెడు బాదములతో ఆరోగ్యవంతమైన సంవత్సరం లోనికి అడుగుపెట్టండి

మీ జీవనశైలిలో సమూలమైన మార్పులను తీసుకువచ్చేందుకు ఖచ్చితమైన సమయంగా సంవత్సరారంభం నిలుస్తుంది. తాజాగా ఏదైనా ప్రారంభించాలనే ఉత్సాహం నూతన సంవత్సరారంభంలో ఉంటుంది. ఈ అదనపు స్ఫూర్తితో పాటుగా నూతన అలవాట్లను స్వీకరించాలనే ఆలోచన, మీ ఆరోగ్యంపై సానుకూల ప్రభావం చూపడంతో పాటుగా ఈ సంవత్సరం సంతోషంగానూ మలువగలదు.
 
ఎంతోమంది ప్రజలు ఇప్పటికీ ఇంటి నుంచి పనిచేయడానికి ఆసక్తి చూపుతున్నారు మరియు చిన్నారులు నూతన సంవత్సరంలో కూడా వర్ట్యువల్‌గా తరగతులకు హాజరవుతున్నారు. అందువల్ల, ఆరోగ్యవంతమైన జీవనశైలిని స్వీకరించేందుకు, అందుకు తగిన నిర్ణయాలను తీసుకుని కట్టుబడటం ఇప్పుడు మరింత ఆవశ్యకం.

కోవిడ్-19 మనకు ఏదైనా బోధించిందీ అని అంటే అది మన జీవనశైలి మరియు అలవాట్లను మార్చుకోవడం మాత్రమే. ఆహారపు అలవాట్లను మార్చుకోవడం ద్వారా తీవ్రమైన వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించుకునే శక్తి లభిస్తుంది. మనం ఏం తింటున్నామనేది మన ఆరోగ్యానికి అతి ముఖ్యమైనది. ఇది చక్కటి జీవనశైలికి తోడ్పాటునందించడంతో పాటుగా మీరు శక్తివంతంగా, సంతృప్తిగా మరియు సంతోషంగా, సురక్షితంగా ఉన్నారనే భరోసానూ అందిస్తుంది.
 
ఆరోగ్యవంతమైన స్నాకింగ్‌ మరియు మీ రోజువారీ ఆహారంలో బాదములను జోడించడమనేది ఆరోగ్యవంతంగా ఈ సంవత్సరాన్ని ఆరంభించడానికి అత్యుత్తమ మార్గంగా నిలుస్తుంది. బాదములలో అత్యంత కీలకమైన విటమిన్‌ ఇ , మెగ్నీషియం, చక్కటి ఫ్యాట్‌, డైటరీ ఫైబర్స్‌, ప్లాంట్‌ ప్రొటీన్‌ ఉంటుంది.

మనం 2021 సంవత్సరంలోనికి అడుగు పెట్టినవేళ, మన కుటుంబాలతో పాటుగా మన జీవితాలలో సైతం సానుకూలమైన మార్పును చిన్నగానే అయినా పెద్దగా తీసుకురావడానికి ప్రయత్నిద్దాం, దీనికోసం ఓ గుప్పెడు బాదములను మీ రోజువారీ ఆహారంలో జోడించండి. మొత్తంమ్మీద సంపూర్ణ ఆరోగ్యం అందించడంలో ఇది ఎంతగానో దోహదపడవచ్చు.
 
సుప్రసిద్ధ బాలీవుడ్‌ నటి సోహా అలీఖాన్‌ మాట్లాడుతూ, ‘‘నూతన సంవత్సర ఆరంభం ఎల్లప్పుడూ ఉత్సాహంగానే ఉంటుంది. మనం ఖాళీ పలక మీద చాక్‌పీస్‌తో మన రిజల్యూషన్స్‌ మరియు లక్ష్యాలను భవిష్యత్‌ కోసం రాసుకుని ప్రారంభించడం ఆనందంగానే ఉంటుంది. మన రిజల్యూషన్స్‌ తీసుకునేటప్పుడు నేను దీర్ఘకాల లేదంటే లక్ష్యదూరమైన గోల్స్‌ను పెట్టుకోను. తక్షణమే ఆరంభించే రీతిలో ఉండే ప్రణాళికలతోనే ఉంటాను. ఈ సంవత్సరానికి నా రిజల్యూషన్‌, అనారోగ్యవంతమైన స్నాక్స్‌ అన్నీకూడా నా కుటుంబం మరియు నా డైట్‌ నుంచి తొలగించడం. దీనికి భరోసాను అందిస్తూ, నేను మాప్యాంట్రీని సమూలంగా మార్చాలనుకుంటున్నాను.
 
ఏదైనా అనారోగ్యవంతమైన అవకాశాలు ఉన్నాయనుకుంటే దానిని ఆరోగ్యవంతమైన బాదములు లాంటి వాటితో నింపాలనుకుంటున్నాను. ఆకలిని తీర్చే గుణాలు బాదములలో ఉండటంతో పాటుగా శక్తిని సైతం అందిస్తాయి. ఇవి ఆరోగ్యవంతమైనవి మాత్రమే కాదు రుచికరంగానూ ఉంటాయి. వీటితో పాటుగా, బాదములలో అతి ముఖ్యమైన పోషకాలు సైతం ఉన్నాయి. ఈ కారణం చేత అవి చక్కటి ఆరోగ్యం అందిస్తాయి’’ అని అన్నారు.
 
ఫిట్‌నెస్‌ నిపుణురాలు, సెలబ్రిటీ మాస్టర్‌ ఇన్‌స్ట్రక్టర్‌ యాస్మిన్‌ కరావాలా మాట్లాడుతూ, ‘‘వర్కవుట్‌కు ముందు లేదా తరువాత స్నాక్‌గా, బాదములు అత్యుత్తమ స్నాకింగ్‌ అవకాశాలను అందిస్తాయి. ఇవి చక్కటి ఆరోగ్యం మరియు శక్తిని ఎలాంటి అవాంఛిత కేలరీలు జోడించకుండా అందిస్తాయి. సెలవులు ముగియడంతో పాటుగా నూతన సంవత్సరం ఆరంభం కావడంతో, మనం మన లక్ష్యాలను పునఃనిర్ధేశించుకోవడంతో పాటుగా వాటికి ఓ ఆకృతిని సైతం అందించాల్సి ఉంది. 

మనందరికీ తరచుగా వ్యాయామాలు చేయాల్సిన ఆవశ్యకత తెలుసు అలాగే మన సంపూర్ణ ఆరోగ్యానికి దానిని జోడించాల్సిన ఆవశ్యకత కూడా తెలుసు. అది బరువు తగ్గడం లేదా ఒత్తిడి తగ్గించుకోవడంకు మద్దతు అందించడంలో అయినా లేదంటే మన భావోద్వేగాలను వృద్ధి చేసుకోవడం, పలు జీవనశైలి వ్యాధులను అత్యుత్తమంగా నిర్వహించుకోవడంలో అయినా సరే ఇది తోడ్పడుతుంది. అయితే, డైట్‌ మరియు వ్యాయామాలు ఒకదానితో ఒకటి కలిసి ఉంటాయి.
 
ఒక ఆరోగ్యవంతమైన అలవాటు ఆరంభించినా దానిని అనారోగ్యవంతమైన ఆహారపు అలవాట్లతో జోడిస్తుంటారు. అందువల్ల నేను ఈ సంవత్సరం అత్యుత్తమ ఫిట్‌తో ఉండేలా నన్నునేను మలుచుకోవాలనే లక్ష్యంతో ఆరంభించాను. ఇతరులు కూడా అదే అనుసరిచాలని కోరుకుంటున్నాను. 2021 ఆరంభంను అత్యుత్తమ ఫిట్‌నెస్‌, డైట్‌ తో ఆరంభించాలి మరియు గుప్పెడు బాదములతో మీ వ్యాయామ ప్రక్రియకు తగిన ఇంధనమూ అందించాలి’’ అని అన్నారు
 
షీలా కృష్ణస్వామి, న్యూట్రిషన్‌ అండ్‌ వెల్‌నెస్‌ కన్సల్టెంట్‌ మాట్లాడుతూ, ‘‘మనలో చాలా మందికి 2020వ సంవత్సరం ఓ వైవిధ్యమైన సంవత్సరం. ప్రతి ఒక్కరూ దీనిని వినూత్నంగా అధిగమించేందుకు ప్రయత్నించారు. కానీ భారతదేశంలోఅధికశాతం గృహాలలో అతి సాధారణంగా కనిపించిన అంశం ఏమిటంటే అనారోగ్యవంతమైన ఆహారం తీసుకోవడం పెరగడం. కానీ నూతన సంవత్సరంలోకి అడుగుపెడుతున్న వేళ, మన అనారోగ్యవంతమైన అలవాట్లను వెనుక్కి నెట్టాల్సిన ఆవశ్యకత ఉంది. లేదంటే, అవి మన ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతాయి.
 
అందువల్ల, 2021లో మీ స్నాకింగ్‌ ప్లేట్‌ను నూనెతో కూడిన లేదా ఫ్రై చేసిన ఆహారంకు బదులుగా ఆరోగ్యవంతమైన ఆహారం అయిన బాదములు, తాజా పళ్లు, ఉడికించిన కూరగాయలు లాంటి వాటితో నింపండి. బాదములకు పలు ఆరోగ్యప్రయోజనాలను అందించే గుణం ఉంది. బరువు మరియు మధుమేహ నియంత్రణలో తోడ్పడటంతో పాటుగా గుండె ఆరోగ్యం సైతం మెరుగుపరిచి చర్మ సౌందర్యంకూతోడ్పడుతుంది. ఇది మీ సంపూర్ణ ఆరోగ్యంకు తోడ్పడటంతో పాటుగా దీర్ఘకాలంలో మీ సంక్షేమానికీ తోడ్పడుతుంది’’ అని అన్నారు. మీరు దేని కోసం వేచిచూస్తున్నారో ఖచ్చితంగా తెలియదా, ఆరోగ్యవంతంగా, ఫిట్‌గా మరియు సంతోషంగా ఉండేందుకు 2021ను ఆరంభించండి!