1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. మనస్తత్వ శాస్త్రం
Written By Selvi
Last Updated : బుధవారం, 1 ఏప్రియల్ 2015 (15:08 IST)

స్నేహితుల వల్ల నష్టం కన్నా లాభాలే ఎక్కువ..!

ఒంటరితనం మంచిదికాదు. ఏ వయసులో అయినా స్నేహితులు అవసరమే. స్నేహితులవల్ల చెడిపోయిన వారు లేకపోలేరు. అయితే స్నేహితుల వల్ల నష్టం కన్నా లాభాలే ఎక్కువ. స్నేహితులు కలవారి శరీరానికి తెలియకుండానే వ్యాయామం వస్తుంది. 
 
స్నేహితుల కోసం నడుస్తారు. టీనేజ్‌లో అయితే స్నేహితుల కోసం పరిగెత్తడం చేస్తారు. స్నేహితుల కోసం పరిగెత్తడం, ఆటలు ఆడటం వంటివి చేస్తారు. స్నేహితులతో సాయంత్రం గడిపినవారు హాయిగా నిద్రపోగలుగుతారు. రోజూ కలుసుకోలేక పోతే కనీసం ఫోన్‌లో కబుర్లు చెప్పుకోవడం మంచిది. స్నేహితులు లేకుంటే ఇంట్లోవారితో అయినా కొద్ది సమయం కబుర్లతో గడపాలి. 
 
ఎవరితోనూ మాట్లాడకుండా ఒంటరిగా వుండే వారికి రక్తపోటులో మార్పులొచ్చే అవకాశాలు ఎక్కువని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ఒంటరితనం బాధ పోగొట్టుకునేందుకు కనిపించిన వాటినల్లా తింటారు. దీనివల్ల శరీరరూపం మారుతుంది. భారీకాయులలో చాలామంది స్నేహితులు లేనివారేనన్న విషయం గమనించాలి.