బుధవారం, 28 జనవరి 2026
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. మనస్తత్వ శాస్త్రం
Written By ivr
Last Modified: శుక్రవారం, 26 సెప్టెంబరు 2014 (21:34 IST)

ఓ సెక్సీ తార మాస్క్ నాకు తొడిగి సెక్స్ చేస్తున్నాడు... ఇదేమైనా జబ్బా...?

నా అంత అందగత్తె లేదని నా వెంటబడి ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఇప్పుడు సినిమాల్లో తనకు బాగా నచ్చిన అందమైన నటి గురించి పొద్దస్తమానం చెపుతున్నాడు. అలా చెబితే చెప్పారు కానీ, ఈమధ్య ఆ నటి ముఖం తాలూకు మాస్కును తెచ్చి నా ముఖానికి తొడిగి సెక్స్ చేస్తున్నాడు. అదేమని అడిగితే... ఆమెతో ఎలాగూ పాల్గొనలేను. కనీసం ఊహలోనైనా చేయనీ అంటున్నాడు. నాకు జుగుప్సగా ఉంది. ఆయనకేమైనా మతి చలించిందా... ఎందుకిలా ప్రవర్తిస్తున్నారు...?
 
ఓ పత్రిక ఆమధ్య చేసిన సర్వే ప్రకారం పురుషుల్లో దాదాపు 40 శాతం మంది సినీ తారలతో సెక్సీ ఊహలను కలిగి ఉంటున్నారట. వారితో రతి చేస్తున్నట్లు ఫాంటసీ కూడా చేస్తున్నారని తేలింది. మరి అంతగా సినిమా తారల ప్రభావం కొంతమంది పురుషులపై ఉంటుంది. వారు అభిమానించే నటిపై ఇలాంటి ఊహలు పెరిగిపోవడం మూలంగా ఆయన ఆమె తాలూకు మాస్కును తెచ్చి మీ ముఖానికి తొడిగి ఇలా ప్రవర్తిస్తున్నారు. 
 
ఈ అలవాటు కాస్త ఇబ్బంది కలిగించేదే. ఐతే ఇదేమీ మానసిక జబ్బు కాదు కానీ ఈ ప్రవర్తనను మెల్లగా మార్చుకోవచ్చు. ముఖ్యంగా అతడు అందానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాడని అర్థమవుతుంది కనుక ఆ విధంగా అందానికి మెరుగులు దిద్దుకుని అతడి ప్రవర్తనను అటు నుంచి ఇటువైపుకు మార్చుకోవచ్చు.