1. వినోదం
  2. హాస్యం
  3. చెవాకులు
  4. Bangaluru IT Raids, one Mouth publicity comment, 5 crore illegal money

రూ.5 కోట్ల నల్లడబ్బును మార్చితే కమీషన్ ఇవ్వరా? ఐటీ అధికారులు వచ్చారుగా... ఇక ఇప్పుడు ఏడవండి...

బెంగళూరులో నిన్న ఆదాయపన్ను అధికారుల తనిఖీల్లో పట్టుబడిన రూ. 5 కోట్ల నగదు వ్యవహారంపై ఓ మౌత్ పబ్లిసిటీ తిరుగుతోంది. అదేంటయా అంటే... బెంగళూరుకు చెందిన ఇద్దరు బడా కాంట్రాక్టర్లు కమ్ ఇంజినీర్ల వద్ద బోలెడు డబ్బు ఉంది. అదేనండీ పాత రూ.500, రూ.1000 నోట్లు. నవ

Bangaluru IT Raids
బెంగళూరులో నిన్న ఆదాయపన్ను అధికారుల తనిఖీల్లో పట్టుబడిన రూ. 5 కోట్ల నగదు వ్యవహారంపై ఓ మౌత్ పబ్లిసిటీ తిరుగుతోంది. అదేంటయా అంటే... బెంగళూరుకు చెందిన ఇద్దరు బడా కాంట్రాక్టర్లు కమ్ ఇంజినీర్ల వద్ద బోలెడు డబ్బు ఉంది. అదేనండీ పాత రూ.500, రూ.1000 నోట్లు. నవంబరు 8న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పెద్దనోట్ల రద్దు ప్రకటనతో వారు తల్లడిల్లిపోయారట. అలా బెడ్ మాళిగల్లో( అంటే మంచం పరుపు కింద) దాచిపెట్టుకున్న బ్లాక్ మనీని ఎలా మార్చుకోవాలో అర్థంకాక దిమ్మతిరిగిపోయారట. 
 
ఆల్రెడీ వీళ్ల బ్లాక్ మనీ వ్యవహారం తెలిసిన ఓ వ్యక్తి ( బ్రోకరు) తనకు కొందరు బ్యాంక్ సిబ్బంది తెలుసుననీ, వారి ద్వారా నల్లడబ్బును తెల్లడబ్బుగా మార్చుకోవచ్చని సలహా ఇచ్చాడట. అతడు చెప్పినట్లే వారు సదరు బ్యాంక్ సిబ్బందితో కలవడమే కమీషన్లు గట్రా మాట్లాడుకోవడం అంతా జరిగిపోయిందట. మధ్యలో బేరం కుదిర్చిన వ్యక్తి(బ్రోకరు)కి ఇస్తానన్న కమీషన్ ఇవ్వలేదట. 
 
చూద్దాం... అంటూ దాటవేయడం మొదలుపెట్టారట. అసలు ఇవ్వం ఏం చేసుకుంటావో చేస్కో అని కూడా అనేశారట. అంతమాటన్నాక అతడు ఊరుకుంటాడా... ఎంచక్కా వెళి ఎక్కడ గిల్లాలో అక్కడ గిల్లేశాడట. ఇంకేముంది విషయం గట... గట.. గటా... మంటూ బెడ్ మాళిగల్లో దాచిన రూ.2000 నోట్ల కట్టలతోపాటు 7 కిలోల బంగారం కాస్తా బయటపడిందట. 
 
ఇది నిజమో కాదా తెలియదండీ.. కేవలం మౌత్ పబ్లిసిటీ... సో.. DeMonetisation నేపధ్యంలో ఎవరైనా బ్రోకర్లుగా వ్యవహరించి నల్లడబ్బును తెల్లగా మార్చేందుకు సహకరించినట్లయితే త్వరలో రూ.2000 కట్టలను మాళిగల్లో దాచుకున్నవారి ఇళ్లలోనూ గంటలు మోగవచ్చు.
About Writer
ivr
Possessing over 27 years of experience in journalism, the author has served as an Assistant Scriptwriter and Researcher for the electronic Media ETV and ETV2, as well as a Sub-Editor for the magazines Swathi Sapariwara patrika and Sunday Indian. In addition to these roles, the author has contributed short stories.... మరింత చదవండి