సానియా మీర్జా ఇన్ జేమ్స్‌ బాండ్ మూవీ: బాండ్ బేబీగా హాట్ హాట్‌గా..

Selvi| Last Updated: బుధవారం, 12 నవంబరు 2014 (16:33 IST)
తెలంగాణ అంబాసిడర్, టెన్నిస్ స్టార్ సానియా మీర్జా గురించి ఓ ఆశ్చర్యకరమైన వార్త వినిపిస్తోంది. సానియా మీర్జాకి జేమ్స్ బాండ్ మూవీలో నటించే అవకాశం వచ్చిందట. ఈ విషయాన్ని సానియా మీర్జా స్వయంగానే చెప్పింది.

జేమ్స్ బాంబ్ సినిమాలో నటించే సూపర్ ఛాన్స్ తనకు లభించిందని సానియానే స్వయంగా ట్విట్టర్ ద్వారా వెల్లడించింది. తాను 'బాండింగ్'తో ముందుకెళ్తున్నానని, అందరి శుభాకాంక్షలు తనకు కావాలని చెప్పింది. ఈ విషయం నలుగురికీ తెలియజేయకుండా ఉండలేకపోతున్నానని కూడా అందులో రాసింది.

ఇంతకుముందు కూడా క్రీడాకారులు సినిమాల్లో నటించిన సందర్భాలున్నాయి. 'గుండెజారి గల్లంతయ్యిందే' సినిమాలో బ్యాడ్మింటన్ క్రీడాకారిణి గుత్తా జ్వాల ఓ పాటలో మెరిశారు.దీనిపై మరింత చదవండి :