1. క్రీడలు
  2. ఇతర క్రీడలు
  3. కథనాలు
  4. Zika crisis: WHO rejects 'move Rio Olympics' call

జికా వైరస్ వ్యాప్తి.. రియో ఒలింపిక్స్ వేదిక మార్చాలన్న నిపుణులు.. నో చెప్పిన డబ్ల్యూహెచ్ఓ!

Zika crisis: WHO rejects 'move Rio Olympics' call
జికా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ప్రతిష్టాత్మక రియో ఒలింపిక్స్‌ వేదిక మార్చాలని 150 మంది నిపుణులు ప్రపంచ ఆరోగ్య సంస్థను ప్రజారోగ్యం, బయోఎథిక్స్, పీడియాట్రిక్స్ రంగాల వారు లేఖ ద్వారా కోరారు. ప్రపంచ ఆరోగ్య సంస్థకు, అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీకి మధ్య దశాబ్దాల అనుబంధం ఉందని, జీకా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో క్రీడల నిర్వహణ వల్ల ఈ సంస్థల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొనే అవకాశం ఉందని నిపుణులు ఆ లేఖలో పేర్కొన్నారు.
 
ప్రపంచాన్ని వణికిస్తోన్న జికా వైరస్‌ను బూచిగా చూపిస్తూ రియో డి జనీరోలో జరిగే ఒలింపిక్స్‌ను వాయిదా వేయాలి లేదా వేరే ప్రాంతానికి మార్చడంపై ఆలోచించాలని నిపుణులు ఆ లేఖలో కోరారు. ప్రపంచ ఆరోగ్య సంస్థలో ఏర్పడిన ప్రత్యేక విభాగం ప్రజారోగ్యం గురించి మాత్రమే కాకుండా ఒలింపిక్స్ వంటి భారీ కార్యక్రమాలకు కూడా సలహాలు ఇవ్వవచ్చునని తెలిపారు. అయితే నిపుణుల విజ్ఞప్తిని ప్రపంచ ఆరోగ్య సంస్థ కొట్టిపారేసింది. రియో నుంచి ఒలింపిక్స్ వేదిక మార్చేది లేదని స్పష్టం చేసింది. 
About Writer
Selvi
తర్వాతి కథనం
శిఖర్ ధావన్‌పై బెంగాల్ దాదా ఫైర్.. ఐపీఎల్ ఫైనల్లోనైనా ఒళ్లు దగ్గరపెట్టుకుని ఆడాలి!